ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > సెక్సీగా గడపాలంటే 34లోనే సాధ్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సెక్సీగా గడపాలంటే 34లోనే సాధ్యం
వయసు పైబడే కొద్దీ మనుషుల్లో లైంగిక వాంఛలు తగ్గిపోతాయని సాధారణంగా అనుకుంటూ ఉంటాం కదా.. లైంగిక వాంఛలు యవ్వనదశలోనే బాగా నెరవేరుతాయని సమాజం భావిస్తున్న అంచనాలు పొరపాటని తాజాగా ఓ సర్వే తెలుపుతోంది. వయసు మీరే కొద్దీ తమ సెక్స్ జీవితాలు రంజుగా మారుతున్నాయని మహిళలు ఘంటాపధంగా చెబుతున్నారు.

యవ్వనంలో కంటే 34 ఏళ్ల నడిప్రాయంలోనే తాము మరింత సెక్సీగా ఉంటామని సగటు మహిళ భావిస్తున్నట్లుగా ఓ తాజా సర్వే చెబుతోంది. యవ్వన దశలో ఉన్నప్పటికంటే నడివయస్సులోనే సెక్స్ కోరికలను ఎక్కువగా తాము తీర్చుకోగలుగుతున్నామని బ్రిటన్ మహిళలు ఢంకా భజాయించి మరీ చెప్పారు.

అస్ట్రాల్ మోయిశ్చరైజర్ బ్రాండ్ కోసం నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న 1,031 మంది మహిళలలో 56 శాతం మంది, యుక్తవయసులో ఉన్నప్పటికంటే 34 ఏళ్ల నడి వయస్సులోనే తాము సెక్స్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నామని తేల్చి చెప్పారు.

ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ సెక్స్ జీవితాలు గతంలో కంటే ఇప్పుడే బాగున్నాయని చెప్పారు. 20 లేదా 30 ఏళ్ల ప్రాయంలో తాము నెలలో 10 సార్లు సెక్స్‌లో పాల్గొనగా 45, 60 ఏళ్ల మధ్యకాలంలో 4.5 సార్లు శృంగార జీవితం గడుపుతున్నామని వీరు చెప్పారు. అయితే 34 ఏళ్ల వయసులో తాము సెక్స్ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించామని వీరి అభిప్రాయం.

మహిళల లైంగిక వాంఛలు, లిబిడో, జీవన శైలి కాలానుగుణంగా మారుతూ వస్తాయనడం వాస్తవమే. అయితే మధ్య వయసులో మహిళలు తమ లైంగిక వాంఛలను మునుపటిలానే తీర్చుకోలేరని చెప్పడం హేతువిరుద్ధంగా ఉంటుందని ఈ సర్వేలో పాల్గొన్న మహిళల నిశ్చితాభిప్రాయం, వృద్ధాప్యంలో కూడా తమ లైంగిక జీవితం సంతృప్తిగా కొనసాగుతోందని వీరు చెప్పడం ఆశ్చర్యకరం.

దీనికి కారణం కూడా ఉంది మరి. 20 లేదా 30 ఏళ్ల వయసుతో పోలిస్తే మహిళలు తమ నడివయస్సు ప్రారంభంలో మరింత ఆత్మవిశ్వాసంతోనూ, స్వావలంబనతో జీవితం గడుపుతున్నారు. తమకు కావలిన దాన్ని పొందడంలో ఈ వయసులో వారికి ఎలాంటి భయసంకోచాలు ఉండవని సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది మహిళలు పేర్కొన్నారు.

దేనికయినా అనుభవం మిన్న అని మన పెద్దలు ఊరికే అనలేదు మరి...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కలసి ఉంటే కలదు దుఃఖం...
అత్తలేని కోడలు... కోడలు లేని అత్త..!
శ్రీలంక మహిళలకూ తప్పని గృహ హింస..!
నోయిడాలో మహిళ పోలీస్ స్టేషన్: మహీందర్ సింగ్
ఐఎఎస్‌ శిక్షణలో మహిళల హవా
మాకు ముద్దులు కావాల్సిందే... ఆస్ట్రియా