ఫ్రెంచ్ అధ్యక్షుడు నికోలా సర్కోజీ, కార్లా బ్రూనీల వివాహ బంధం ఎంత సంచలనం గొల్పిందంటే యూరప్‌లో ఇప్పటకీ ఈ జంట వార్తల్లో హాట్ టాపిక్‍లా కొనసాగుతోంది మరి. ఈ ప్రచారాన్ని అలా పక్కన పెట్టి చూస్తే, పెళ్లాడాలని నిర్ణయం తీసుకోవడానికి తామిద్దరికీ 48 గంటలు మాత్రమే పట్టిందని క్లారా చెప్పారు. తమ దాంపత్యం విశేషాల గురించి దాపరికం లేకుడా ఇటీవలే ఓ టీవీ ఛానెల్‌తో కార్లా పంచుకున్నారు. ఇటాలియన్ సూపర్ మోడల్‌గా ఓ వెలుగు వెలిగిన కార్లా ఫ్రాన్స్ అధ్యక్షుడితో వివాహాబంధంలోకి వెళ్లాలని అతి త్వరగా నిర్ణయం తీసేసుకున్నామని చెప్పారు. దీంతో తన పెళ్లికి డ్రెస్ తీసుకోవడానికి కూడా సమయం సరిపోలేదని ఆమె చెప్పారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తమ పెళ్లికి గాను పారిస్ బ్రాండ్ స్టోర్లలో ఒకదానిలో మోకాళ్లవరకు ఉండే క్రీమ్ కలర్ హెర్మెస్ డ్రెస్‌ను అదరాబాదరాగా ఎంపిక చేసుకున్నానని కార్లా చెప్పారు. పాక్ అధ్యక్షుడితో తొలుత తాను డేటింగ్ కుదుర్చుకున్నప్పుడు వచ్చిన విమర్శల ధాటికి నిజంగా తట్టుకోలేకపోయానని ఆమె అంగీకరించారు. అయితే సర్కోజీతో తాను గాఢమైన సంబంధంలోకి వెళ్లిన తర్వాతే ప్రజలు తనను విశ్వసించనారంభించారని, అప్పటినుంచి అయ్యో ప్రపంచం ఎలా మారిపోయింది అనే రకం వ్యాఖ్యానాలు వెలువడలేదని కార్లా చెప్పారు. సూపర్ మోడల్‌గా, గాయనిగా, పాటల రచయిత్రిగా తన పాత వృత్తి జీవితం గురించి దాపరికం లేకుండా కార్లా 'ఫ్రెంచ్ టీవి'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. |