ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, ఇది ఇదివరకటిమాట. కాని ఇప్పుడు కోరిక అందమెరుగదు అన్నదాన్ని కూడా జోడించుకోవాల్సివుంటుంది. ఎందుకంటే మహిళలను చూడంగానే మగవారికి కోరిక శరవేగంగా పెరిగిపోతుంది. ఇప్పటి వరకున్న ఈ అభిప్రాయానికి కాలం చెల్లిపోయింది. అంద విహీనమైన స్త్రీలను చూసినా కూడా మగవారిలో కోరికలు ఏమాత్రం తగ్గవని హాలెండ్‌లోని గ్రోనింగెన్ విశ్వవిద్యాలయం పరిశో్ధకుల అధ్యయనంలో వెల్లడైంది.
ఈ అధ్యయనం 21 నుంచి 25 ఏళ్ల వయసున్న 63 మంది పురుషులపై అధ్యయనం చేసారు. వీరు ఇంకా చదువుకుంటున్న విద్యార్థులేనని పరిశోధకులు తెలిపారు. కనీసం ముఖ పరిచయం లేని స్త్రీలతో మాట్లాడినప్పుడు వీరిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ సగటున 8 శాతం పెరిగింది. అలాగే పెద్దగా అందంలేని స్త్రీలతో మాట్లాడినప్పుడు కూడా వీరిలో అదే మోతాదులో టెస్టోస్టిరాన్ విడుదలైనట్లు వారు చెప్పారు.
సహజంగానే పురుషుల్లో శృంగారాన్ని పురిగొల్పే నాడీ వ్యవస్థ చురుగ్గా స్పందిస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన లీండెర్ వన్డేర్ తెలిపారు. నాడీవ్యవస్థ చురుగ్గా స్పందించడం వల్ల టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు.
దీంతో పురుషుల్లో హావభావాలు, ప్రవర్తనలో చురుకుదనం, ఆధిపత్య ధోరణి విజృంభిస్తుందని అలాగే కంటి చూపుకూడా చానా పదునెక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇంతే కాకుండా మగవారి శరీరం మరింత నిట్టనిలువుగా తయారవుతుందని, స్త్రీలను ఆకట్టుకోవడానికి మగవారు నిజాలను, అపద్దాలను కలగలిపి కట్టుకథలుగా కూడా చెబుతారని ఈ పరిశోధనలో తేలినట్లు లీండెర్ వన్డేర్ పేర్కొన్నారు. |