ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > అమ్మా...నన్నూ లోకం చూడనీ...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమ్మా...నన్నూ లోకం చూడనీ...!
Gulzar Ghouse
Content consultent
FILE
నిజంగా గర్భస్త శిశువు మాట్లాడే స్థితికి చేరుకుంటే ఎంత బాగుణ్ణుకదా. శిశువు మాట్లాడితే తప్పకుండా తనపై పడే ఆయుధాలను తిప్పికొట్టగలదు. అందుకే ఆ శిశువు అంటోంది..అమ్మా...నన్నూ లోకం చూడనీ...! కానీ భ్రూణ హత్యలు జరిగే సందర్భంలోకూడా తల్లిదండ్రులు శిశువుల మాట వినరుకదా..! కానీ నేను చెప్పదలచుకున్నది ఒకటే.. ఎవరైతే తల్లిదండ్రులు గతంలో భ్రూణ హత్యలు చేశారో వారికి మాత్రమే..నా విన్నపం

అమ్మాయి పుడితే ఒక రకం, అబ్బాయి పుడితే మరోరకంగా తల్లిని చూస్తుంది ఈ లోకం. మరి ఎందుకీ వివక్ష...? అమ్మాయి పుడితే లక్ష్మీ పుట్టిందని భావించే ఈ దేశంలో భ్రూణ హత్యలు ఎందుకు..? పువ్వు పుడితే ఎలా సువాసన వెదజల్లుతుందో అలాగే అమ్మాయి పుడితే ఇల్లంతా సందడిగావుంటుంది.

అమ్మా-నాన్నలకు, చిన్నవారికి-పెద్దవారికి, ఇలా ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా వుంటుంది, చేదోడువాడుగా నిలుస్తుంది. త్యాగానికి ప్రతీక అమ్మాయి జీవితం. అలాంటి అమ్మాయిని మొగ్గలోనే తుంచేయడం ఎంత వరకు సబబు...?

బాలిక పుట్టినప్పటినుంచే తనకు కష్టాలు మొదలవుతాయి. ప్రారంభంనుంచే తనకు ఆంక్షలు విధిస్తుంది ఈ లోకం. అయినాకూడా సమాజాన్ని చదివే నైపుణ్యం కలిగి వుంటుంది అమ్మాయి, అవునా..!

ప్రతి క్షణం అమ్మాయికి నువ్వు..నువ్వు అమ్మాయివి, కాస్త జాగ్రత్తగా మసలుకోవాలి..అంటూ సవాలక్ష ఆంక్షలతో వారి కాళ్ళకు బేడీలు వేస్తుంటారు తల్లిదండ్రులు. కనీసం కలలు కనడానికికూడా వారికి స్వాతంత్ర్యం లేదు.

ప్రస్తుతం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే...అభివృద్ధి ఫలాలకోసం కలలు కనే ఈ సమాజంలో చివరికి ఈ భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, వరకట్నం, ప్రేమించు అని అమ్మాయిలపై యాసిడ్ పోసి వారిని హతమార్చడం, ఈ మధ్య సలసల కాగుతున్న వేడి నూనెను అమ్మాయిపై పోసినవారు జల్సాగా తిరుగుతున్నారే వారికి మమ్మల్ని చంపే అధికారం ఎవరిచ్చారు...?

ప్రజలముందు మనం ఎన్నో ప్రగల్బాలు పలుకుతాము. కాని విషయం తమదాకా వస్తే మాత్రం కట్టుబాట్లు, సంప్రదాయాలు గుర్తుకువస్తాయి. అలా ప్రసంగించేవారుకూడా ఏదో ఒకరకంగా వారుకూడా ఈ భ్రూణ హత్యలకు కారకులేననేది వారు గుర్తుంచుకోవాలి. దీని కారణంగానే గృహ హింసపై చట్టం తీసుకురావాల్సివచ్చింది. అలాగే భ్రూణ హత్యలపై కూడా చట్టంరూపొందించింది ప్రభుత్వం.
1 | 2  >>  
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తల్లి ఊబకాయం... పిల్లలకు ప్రమాదం..!
దాంపత్యానికి చిచ్చుబుడ్డీలు.. మొబైల్ ఫోన్లు..!
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మహిళా అధికారులు
మగాళ్లను కట్టిపడేసే అతివల పెద్ద చుబుకం
ముప్పైల్లోనే అత్యంత సౌందర్యం
గర్భిణీ స్త్రీలు...మీకు వ్యాయామం తప్పనిసరి