ప్రతి నెల కరెంటు బిల్లు చూడగానే మనకు షాక్ కొట్టినట్లౌతుంటుంది. చాలాసార్లు కరెంటు బిల్లుపై ఇంట్లో వాదోపవాదాలు చెలరేగుతుంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఆలోచించేదేంటంటే తాము కరెంటు తక్కువగానే వాడుతున్నామే..అయినాకూడా బిల్లు ఎందుకింత వచ్చింది అని.
ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య..ఆపై కరెంటు బిల్లు సమస్య...దీనికంతటికి కారణం మన అలసత్వమేనంటున్నారు విశ్లేషకులు. అదేంటంటే.. మనకు ఎక్కేడైతే తక్కువ కాంతి అవసరమౌ, అక్కడ ఎక్కువ కాంతినిచ్చే బల్బులను ఉపయోగించడం. అలాగే బల్బును వెలిగించిన తర్వాత దానిని ఆఫ్ చేయకపోవడం, ఫ్రిజ్‌ను చాలాసార్లు తెరుస్తుండటం..ఇంకా ఇంట్లోని హాలులోకాని, గదుల్లోకాని అవసరంవున్నా లేకపోయినాకూడా ఫ్యాన్లు తిరగుతుంటాయి. దీంతో కరెంటు బిల్లు అధికంగా రావడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాటిని నిరోధించడానికి కొన్ని చిట్కాలు మీకోసం.
విద్యుత్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి :-
** సాధారణంగావాడే బల్బుల స్థానంలో సీఎఫ్ఎల్ బల్బులను ఉపయోగిస్తే దాదాపు 70శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. దీంతో సాధారణ బల్బులాగే కాంతికూడా అధికంగానే ఉంటుంది.
** ఇంట్లో వేడి వాతావరణాన్ని నిరోధించడానికి ఇంటి చుట్టూ మొక్కలను పెంచడానికి ప్రయత్నించండి. అవసరమైనప్పుడు మాత్రమే కరెంటును ఉపయోగించడానికి స్విచ్‌ను ఉపయోగించండి.
** కొన్ని ఫ్రిజ్‌లలో డీఫ్రాస్ట్ సిస్టమ్ ఉండదు. అలాంటి వాటిలో ఐస్ బాగా పేరుకుపోతుంది. దీంతో ఫ్రిజ్‌లోని కూలింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రీజర్‌ను డీఫ్రాస్ట్ చేయాలి.
** వేడిగావున్న పదార్థాలు చల్లబడ్డ తర్వాత మాత్రమే వాటిని ఫ్రిజ్‌లో ఉంచండి. దీంతో విద్యుత్ వినియోగం తక్కువ మోతాదులో జరుగుతుంది.
** వేసవి వేడిని తగ్గించుకోవడానికి ఎయిర్ కండీషనర్‌కు బదులుగా సీలింగ్ ఫ్యాన్ కాని లేదా టేబుల్ ఫ్యాన్‌ను ఉపయోగించండి. దీంతో విద్యుత్ వినియోగం తక్కువవుతుంది. ఒకవేళ ఎయిర్ కండీషనర్‌ను ఉపయోగించాలనుకుంటే ఇంట్లోని కిటికీలు, తలుపులు మూసివేయండి.
** ప్రస్తుతం బజార్లో రకరకాల ఆటోమేటిక్ వస్తువులు లభిస్తున్నాయి. వాటిని కాసేపటివరకు వాడకపోతే అవి తమంతట తామే ఆఫ్ అయిపోతాయి. విద్యుత్‌ను తక్కువగా వాడాలనుకుంటే ఇలాంటి వాటిని ఉపయోగించడం సముచితం.
** ముఖ్యంగా ఫ్రిజ్ తలుపు సరిగా మూసారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఫ్రిజ్ తలుపు మూసివేసినాకూడా కాసింత గ్యాప్ ఉంటే వెంటనే ఆ తలుపు సీల్‌ను మార్చివేయండి.
** మిక్సీ లేదా గ్రైండర్ వాడేటప్పుడు అన్ని రకాల పదార్థాలు సరిగావున్నాయా లేదా చూసుకుని వాడితే మంచిది. మళ్ళీ..మళ్ళీ మిక్సీలు, గ్రైండర్లు వాడే పని తప్పుతుంది. అలాగే టీవీ చూసినంతసేపు చూసి వెంటనే ఆఫ్ చేయండి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. |