ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > ఇంట్లో చెత్తకుండీ తప్పనిసరి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంట్లో చెత్తకుండీ తప్పనిసరి
Gulzar Ghouse
Content consultent
సాధారణంగా ప్రతి ఇంట్లో విరిగిపోయిన లేదా పాత ప్లాస్టిక్ బకెట్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ బుట్టలు లేదా డబ్బాలు చివరికి ప్లాస్టిక్(బియ్యం) సంచులను చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)గా వాడుతుంటారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఇంటీరియర్ డెకరేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కాని ఇంట్లో చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)పై మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ కనబరచడంలేదు. ఈ రోజుల్లో చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)లు రంగు రంగులలో, మంచి మంచి డిజైన్లలో రూపొందించబడి అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలాంటి చెత్తకుండీ(డస్ట్‌బిన్‌) కొనడం, వాటిని ఉపయోగించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

** చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)‌ని ముందుగా ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించి దానికనుగుణంగా సరిపోయే డస్ట్‌బిన్‌ను కొనండి. బెడ్‌రూమ్, డ్రాయింగ్ రూంలాంటి ప్రాంతాలలో ఉంచుకోవాలనుకుంటే అందమైన డిజైన్లతో రూపొందించబడిన, మూతతోనున్న చిన్న సైజులు, తేలికపాటి చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అలాగే బయట వరెండాలో లేదా హాలులో ఉంచాలనుకున్నప్పుడు కాస్త పెద్దది, ముదురు రంగుతో కూడిన మూత కల చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)ని కొనండి.

** వీలైతే చెమ్మకలిగిన వ్యర్థపదార్థాలకోసం, అలాగే డ్రైగానున్న పదార్థాలకోసం వేరువేరుగా చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)లను ఏర్పాటు చేయండి. దీంతో తినుబండారాలు వ్యర్థం అయితే వాటిని జంతువులకు వేయవచ్చు లేదా అవసరమైన ఎరువును తయారుచేసుకోవడానికికూడా ఉపయోగించుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.

** వీలైతే ఇంట్లోని ప్రతి గదిలోనూ ఒక చిన్న చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)ని ఏర్పాటు చేసుకోండి. దీంతో గదుల్లోనున్న చెత్తను అందులోవేసి గదిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు చెత్తను చెత్తకుండీలలోనే వేసే పద్దతిని వారికి అలవాటు చేయవచ్చు.

** వంటగదిలో ఎల్లప్పుడూ మూతతోనున్న చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)ని ఏర్పాటు చేసుకోండి. దీంతో మీరు నిలబడే అందులో చెత్తనువేయవచ్చు.

** చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)లోనున్న చెత్తను బయట పారబోస్తే దాని బయట-లోపలకూడా నీటితో కడగి ఆరబెట్టండి. అలాగే చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)అడుగుభాగాన ఓ పాలిథిన్ కవరును వేయండి, దీంతో మీ చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)శుభ్రంగా ఉంటుంది.

** వారానికొకసారి డెట్టాల్‌ లేదా ఫినాయిల్‌తో కడిగి శుభ్రంచేసి ఆరబెట్టండి. ఆ తర్వాత దానిని వాడడానికి ఉపయోగించండి. దీంతో ఇందులో క్రిములు, కీటకాలు చేరే అవకాశం ఉండదు.

** పాచిపోయిన ఆహారం, ముఖ్యంగా పప్పులు, అన్నం, కాయగూరలులాంటి వ్యర్థ పదార్థాలను చెత్తకుండీ(డస్ట్‌బిన్‌)లో మూతలేకుండా పడేయకండి. వాటిని పాలిథిన్ కవర్లలో వేసి చెత్త కుండీలలో పడవేయండి. దీంతో అందులోనుంచి వచ్చే దుర్గంధం బయటకు రాదు.

** వరెండాలో పెట్టే చెత్తకుండీలను పక్షులు, కోతుల బారినపడకుండా కాపాడండి. ఇక్కడ ప్రత్యేకంగా మూత ఉన్న చెత్తకుండీలనే(డస్ట్‌బిన్‌) వాడండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కరెంటు బిల్లు ... చిట్కాలు
పనిఒత్తిడితో ఉద్యోగినుల్లో ఆరోగ్య సమస్యలు
అమ్మా...నన్నూ లోకం చూడనీ...!
తల్లి ఊబకాయం... పిల్లలకు ప్రమాదం..!
దాంపత్యానికి చిచ్చుబుడ్డీలు.. మొబైల్ ఫోన్లు..!
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మహిళా అధికారులు