ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > ఆప్ఘన్‌లో భార్యలపై అత్యాచారానికి చట్టబద్ధత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆప్ఘన్‌లో భార్యలపై అత్యాచారానికి చట్టబద్ధత
లైంగిక కార్యకలాపాలు భర్తల ఇష్టానుసారమే..!
FILE
జీవిత భాగస్వామికి ఇష్టం లేకుండా, ఆమెతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లయితే... అది అత్యాచారం కిందకే వస్తుందని, భారత న్యాయస్థానాలు ఓ వైపు చెబుతుంటే... ఆప్ఘనిస్తాన్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడి ప్రభుత్వం భార్యలపై అత్యాచారాలకు చట్టబద్ధత కల్పించటమేగాకుండా, లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు భర్తకు ఇష్టంగా ఉంటే మాత్రం సరిపోతుందని తేల్చిచెప్పింది.

గతంలోని తాలిబన్ ప్రభుత్వ పోకడలను సైతం తలదన్నే రీతిలో... పూర్తి మహిళా వ్యతిరేకమైన సరికొత్త షియా కుటుంబ చట్టాన్ని ప్రవేశపెట్టారు ప్రస్తుత ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్. ఈ కొత్త చట్టాన్ని అనుసరించి.. షియా మతస్థుడైన భర్తకు, కనీసం వారానికి నాలుగుసార్లైనా లైంగిక వాంఛలను తీర్చాల్సిందిగా భార్యను డిమాండ్ చేసే హక్కు సంక్రమించింది.

అంతేగాకుండా... ఈ తాజా షియా కుటుంబ చట్టం బాల్య వివాహాలకు సైతం ఆమోద ముద్ర వేసింది. భార్యలను నిరవధికంగా ఎంతకాలమైనా సరే ఇంట్లోనే నిర్బంధించే హక్కును కూడా భర్తలకు కట్టబెట్టింది. అలాగే ఏదేని కారణాల రీత్యా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్లయితే... ఎలాంటి మినహాయింపులకూ తావు లేకుండా, పిల్లలు ఎప్పటికీ తండ్రికే చెందుతారని ఈ చట్టం చెబుతోంది.

ఇంతటి గొప్ప ఘనత కలిగిన షియా కుటుంబం చట్టం... భర్తలకు సైతం బాధ్యతనొకదాన్ని కూడా నెత్తిమీద పెట్టింది. అదేంటంటే... కనీసం నాలుగు నెలలకు ఒకసారైనా భర్తలు, భార్యలతో లైంగికంగా గడపాలని నిర్దేశించింది. షియా మహిళలు లైంగిక వాంఛల విషయంలో భర్తల నిర్లక్ష్యానికి గురికాకుండా పరిరక్షించే చర్యల్లో భాగంగానే ఇలా చేసినట్లు అది పేర్కొంటోంది.

ఇదిలా ఉంటే... పూర్తి మహిళా వ్యతిరేకమైన కుటుంబ చట్టాలను నిర్దేశించిన ఆప్ఘన్ ప్రభుత్వంపై ప్రపంచమంతటా నిరసనల వెల్లువెత్తుతున్నాయి. స్త్రీలను బానిసలను చేసేందుకు, మగవాళ్లకు హక్కులు కల్పించేందుకోసమేనా ఈ చట్టాలున్నాయంటూ... ఆప్ఘన్ మహిళలు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ, అమెరికా విదేశాంగ శాఖ హమీద్ కర్జాయ్‌పై ఒత్తిడి తెస్తోందని పలు పత్రికలు వెల్లడించాయి. ఇదే విషయమై జీ-20 సమావేశాలలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కర్జాయ్‌ను కలుసుకుని చర్చించారు. ఆమె కర్జాయ్‌తో ఏం విషయాలు మాట్లాడారో మాత్రం వెల్లడికాకపోయినా, తమ అభిమతం కర్జాయ్‌కు తెలిసే ఉంటుందని ఒబామా చెప్పడం గమనార్హం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
స్వాత్ వ్యాలీలో యువతికి కొరడా దెబ్బలు
మోసకారి మొగుళ్ల భరతంపట్టే "స్ట్రీట్ వ్యూ"
ఇంట్లో చెత్తకుండీ తప్పనిసరి
కరెంటు బిల్లు ... చిట్కాలు
పనిఒత్తిడితో ఉద్యోగినుల్లో ఆరోగ్య సమస్యలు
అమ్మా...నన్నూ లోకం చూడనీ...!