ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > ఉద్దిపప్పుతో ఫేస్‌ప్యాక్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉద్దిపప్పుతో ఫేస్‌ప్యాక్
Gulzar Ghouse
Content consultent
అందంకోసం అనేక రకాల సాధనాలు ప్రయోగిస్తుంటారు. కాని ప్రకృతి పరమైన సాధనాలను ఉపయోగిస్తే మంచి లాభం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ అందంలో కాస్త నిగారింపును కొనసాగించాలనుకుంటే ప్రకృతి ప్రసాదించిన పప్పుదినుసులతో ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోండి.

పప్పుదినుసుల్లో ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియంలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి మనిషికి ఆరోగ్యంతోబాటు సౌందర్యాన్నికూడా ఇనుమడింపజేస్తుంది.

మనిషి శరీరానికి దాదాపు 22 రకాల అమినో ఆమ్లాలు అవసరమవుతాయంటున్నారు వైద్యులు. ఇవన్నీకూడా ప్రొటీన్లలలో లభ్యమవుతాయి. ఈ ప్రొటీన్లు పప్పుదినుసులలో అత్యధికంగా లభ్యమవుతాయి. ప్రొటీన్లు శరీరంలో బలాన్ని చేకూరుస్తాయి. దీంతో ఉత్సాహం పెంపొందుతుందంటున్నారు వైద్యులు.

పప్పుదినుసుల నీటిలో నానబెట్టి మొలకెత్తేలా చేస్తే వీటిలో ప్రొటీన్లు, ఇనుముతోబాటు విటమిన్ బీ, సీ, ఈ, కేలు లభ్యమవుతాయి.

రాజమా, సోయాబీన్‌లాంటి పప్పుదినుసులలో క్యాల్షియం ఏక్కువశాతం ఉంటుంది. ఇవి మనిషి శరీరంలోని దంతాలను పుష్టిగా ఉంచుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

పప్పుదినుసులతో శరీరానికి పౌష్టిక తత్వాలు పుష్కలంగా అందుతాయి. అదే పప్పుదినుసులను పొడిగా చేసుకుని వాటిని శరీరంపై రాసుకుంటే శరీరంపైనున్న మచ్చలను దూరంచేయవచ్చు. అలాగే శరీర రంగునుకూడా మార్చవచ్చంటున్నారు వైద్యులు. శరీరంలోని చర్మంతోబాటు వెంట్రుకలుకూడా బలిష్టంగా మారుతాయి.

ఉద్దిపప్పుతో ఫేస్‌ప్యాక్:

ఉద్దిపప్పును బాగా కడిగివేయండి. దీనిని రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం లేవంగానే దీనిని మిక్సీలో రుబ్బేయండి. అలాగే పెరుగును అందులో కలిపేయండి. ఈ రెంటి మిశ్రమాన్ని ముఖానికి రాయండి. అలా 15 నిమిషాలవరకు అలాగే ఉంచండి. బాగా ఎండిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగివేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా తాయారై నిగారింపు పెరుగుతుందంటున్నారు వైద్యులు.

మీ చర్మం మరింత కాంతివంతంగా మారాలంటే ఉద్దిపప్పు పొడిలో కాసింత రోజ్ వాటర్, గ్లిజరిన్, బాదాం నూనెనుకలిపి ముఖానికి రాయండి. నల్ల ఉద్దిపప్పును ఉడకబెట్టి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇందులో మెంతుల పొడిని కలిపి వెంట్రుకలకు రాయండి. రెండు గంటల తర్వాత కేవలం నీటితోనే వెంట్రుకలను కడిగివేయండి. దీంతో మీ వెంట్రుకలు చిక్కగా, పొడవుగా, నల్లగా, బలిష్టంగా మారుతాయంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"ఆప్ఘన్ వైవాహిక చట్టం"పై మహిళల ఆగ్రహం
ఆమెకు పదిమంది భర్తలు: అందరికీ విడాకులే
ఆప్ఘన్‌లో భార్యలపై అత్యాచారానికి చట్టబద్ధత
స్వాత్ వ్యాలీలో యువతికి కొరడా దెబ్బలు
మోసకారి మొగుళ్ల భరతంపట్టే "స్ట్రీట్ వ్యూ"
ఇంట్లో చెత్తకుండీ తప్పనిసరి