బియ్యం అంటే తెలియనివారెవరూ ఉండరు. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఆహారంగా బియ్యాన్ని తీసుకుంటుంటారు. బియ్యం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది తేలికగా జీర్ణమయ్యే పదార్థం. దీనిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళే కాకుండా అనారోగ్యంగా ఉండేవారుకూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పాత బియ్యం చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే చాలామంది పాతబియ్యాన్నే కోరుకుంటుంటారు.
మీరు రాత్రిపూట తీసుకునే ఆహారంలో రోటీ(చపాతీ) తీసుకుని, ప్రతిరోజూ అన్నం తీకుంటుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది శరీరంలో రక్త శాతాన్ని పెంపొందించి, జీర్ణశక్తిని పెంచుతుందని వారు తెలిపారు.
మూడు సంవత్సరాలకు మునుపటి బియ్యంలో చాలా బలం, రుచి ఉంటుంది. అన్నం గంజితోబాటు తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. గంజిని వేరుచేస్తే బియ్యంలోనున్న ప్రొటీన్లు, ఖనిజ పదార్థాలు, విటమిన్లు తొలగిపోతాయి. అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వృధా అంటున్నారు వైద్యులు.
జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు అన్నంలో పాలు కలుపి ఇరవై నిమిషాలపాటు ఉంచి తర్వతా తినిపిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
గుండెల్లో, కడుపులో మంటగా ఉంటే అన్నం వండేటప్పుడు వచ్చే గంజిలో నిమ్మకాయ రసంతోబాటు ఉప్పు కలుపుకుని త్రాగితే ఫలితం ఉంటుంది.
ఇదే విధంగా బియ్యం, పప్పు(ముఖ్యంగా పెసలపప్పు), ఉప్పు, మిరపకాయలు, ఇంగువ, అల్లంలాంటి మసాలాలు కలిపి తయారు చేసిన కిచిడీలో నెయ్యి కలుపుకుని తింటే శరీరానికి బలం చేకూరుతుంది. దీంతో బుద్ధి వికసిస్తుంది. జీర్ణక్రియకూడా పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అతిసార వ్యాధితో బాధపడుతుండేవారు బియ్యపు పిండిని బాగా ఉడకబెట్టి పేస్ట్‌లా చేసుకుని, అందులో ఆవు పాలను కలుపుకుని త్రాగితే ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
మీరు గర్భనిరోధాన్ని పాటించాలి, కాని మాత్రలు వాడటానికి ఇష్టం లేనివారు బియ్యం కడిగిన నీటిలో బియ్యపు మొక్కల వేర్లను రుబ్బి వడగట్టండి. అందులో తేనె కలుపుకుని త్రాగండి ఫలితం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది గర్భ నిరోధానికి దివ్యౌషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయర్వేద వైద్యులు. |