ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > సహజ "సన్‌స్క్రీన్"లు పండ్లు...!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సహజ "సన్‌స్క్రీన్"లు పండ్లు...!!
FILE

ఓ వైపు ఎండ దంచేస్తున్నా.. మరోవైపు నోరూరించే మామిడిపండ్లు, తాటి ముంజెలు, పుచ్చకాయలు... ఇలా ఎన్నోరకాల పండ్లు దొరికే కాలం వేసవి. ఈ ఫలాలన్నీ కేవలం దాహార్తిని తీర్చటమే గాకుండా, ఎండ నుంచి చర్మానికి సన్‌స్క్రీన్ లాంటి సహజ రక్షణను కల్పిస్తాయి కూడా...!

నోరూరించే మామిడిపండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఒకరోజు అవసరానికి సరిపడే సి-విటమిన్ వీటి నుంచి లభిస్తుంది. సి-విటమిన్ వేసవి కాలంలోని అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. అలాగే చర్మానికి నిగారింపునిచ్చే విటమిన్-ఇ, పొటాషియం, ఐరన్, నికోటిన్ యాసిడ్‌లు మామిడిపండులో పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల చర్మం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది.

దానిమ్మపండు నుంచి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా పొందవచ్చు. ఎస్పీఎఫ్-25 (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) క్రీమును వాడితే ఎండ నుంచి చర్మానికి ఎంత రక్షణ లభిస్తుందో, ఒక దానిమ్మపండును తినడం వల్ల కూడా అంతే రక్షణ లభిస్తుంది. పుచ్చకాయలో పుష్కలంగా లభించే నీరు డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాదు, మూత్రపిండాలకు కూడా మేలు చేస్తుంది. వీటిలోని గింజలకు కూడా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే శక్తి ఉంది.

తీవ్రమైన ఎండ వేడిమి కారణంగా నీటితో పాటు, ఇతర ఖనిజ లవణాలను కోల్పోతుంటాం. వీటి లోటును తీర్చేందుకు ఎండు అంజూరాలు మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఇక కొబ్బరి బోండాంల సంగతి చెప్పనవసరమే లేదు. అలాగే, తాజా చెర్రీపండ్లు శరీరాన్ని తేలికగా, తాజాగా ఉంచుతాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గర్భనిరోధానికి బియ్యం ఓ ఔషధం...!
అమ్మలతో పోట్లాటలకు అమ్మాయిలు సై..!
ఉద్దిపప్పుతో ఫేస్‌ప్యాక్
"ఆప్ఘన్ వైవాహిక చట్టం"పై మహిళల ఆగ్రహం
ఆమెకు పదిమంది భర్తలు: అందరికీ విడాకులే
ఆప్ఘన్‌లో భార్యలపై అత్యాచారానికి చట్టబద్ధత