ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > ఊబకాయాన్ని తగ్గించండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఊబకాయాన్ని తగ్గించండిలా...!
Gulzar Ghouse
Content consultent
FILE
అందమైన ఆకృతి, గుండ్రటి ముఖం, నాజూకైన నడుము ఇలాగుంటే ఎదుటివారిని ఇట్టే కట్టి పడేయవచ్చు. కాని దీనికి తగిన ప్రయత్నం తప్పనిసరి. వ్యాయామం, శారీరక శ్రమ, జిహ్వ చాపల్యాన్ని కట్టిపెట్టడంతో ఊబకాయాన్ని కట్టిపెట్టవచ్చు

ఊబకాయంతో బాధపడుతున్నవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని:-

నియమానుసారం వ్యాయామం, ఆటపాటలు, వేగంగా నడవడం, శారీరక బరువును క్రమబద్దీకరించుకోవడం. ఆటపాటలు, వ్యాయామమే శారీరక శ్రమ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంటి పనులు అంటే ఇల్లు-వాకిలి ఊడవటం, బట్టలు ఉతకటం మొదలైనవి. ఇవి చేస్తుంటే శరీరంలోని కొవ్వు తగ్గి కాస్త తేలికగా ఉంటుంది.

వ్యాపార కార్యక్రమాలు, కార్యాలయ కార్యక్రమాలు లేదా ఇంటి పనులు అయిన వెంటనే పడకగదికెళ్ళి గురక పెట్టకండి. నిద్రపోవడం, అలసట తీర్చుకోవడం మంచిదే, కాని కొద్ది రోజులైన తర్వాత వీటివలన కలిగే దుష్పరిణామాలు బయటపడతాయంటున్నారు వైద్యులు.

మీకున్న ఖాళీ సమయంలో కుట్లు, అల్లికలు, పెయింటింగ్, రచన లేదా ఇతర కార్యక్రమాలను రూపొందించుకోండి. దీంతో మీరు ఊబకాయంనుంచి బయటపడగల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చాలామంది పగలంతా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. కాస్త ఖాళీ సమయం దొరికినాకూడా ఏదో ఒకటి తినడం, టీ.వీని వీక్షించడం చేస్తుంటారు. మరికొంతమందైతే ఏదో ఒకటి తింటూ ఇతరులను తమవైపు ఆకర్షించేందుకు సతవిధాలా ప్రయత్నిస్తుంటారు.

కారణం ఏదైనా కావచ్చు, పగలంతా తింటుంటే శరీరంలో కొవ్వు శాతం అధికంగా పెరిగిపోతుంది. దీంతో జీర్ణ శక్తి తగ్గిపోతుందంటున్నారు వైద్యులు.

కాసింత దూరమైతే నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఎలాంటి పరిస్థితులలోనూ వాహనంలో వెళ్ళకండి. నడిస్తే వ్యాయామం చేసినట్లేనన్నది గుర్తుంచుకోండి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గర్భావస్థలో ఫిజియోథెరపీ...!
సహజ "సన్‌స్క్రీన్"లు పండ్లు...!!
గర్భనిరోధానికి బియ్యం ఓ ఔషధం...!
అమ్మలతో పోట్లాటలకు అమ్మాయిలు సై..!
ఉద్దిపప్పుతో ఫేస్‌ప్యాక్
"ఆప్ఘన్ వైవాహిక చట్టం"పై మహిళల ఆగ్రహం