మహిళలకు ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్వరూపం సహజంగా మారిపోతోంది. వారు ఇంటిపనులను చక్కబెట్టుకుని బయటి పనులుకూడా నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్నారు.
వారు ఒక మల్టీ నేషనల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ పదవినుంచి స్వంతంగా వ్యాపారం చేసే యజమానురాలిగా కూడా తమ నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్నారు.
కాని నిత్యం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయటం మూలాన, శారీరకంగానే కాక మానసికంగాకూడా అలసిపోతున్నారు. అలాగే కళ్లు కూడా విపరీతంగా అలసి పోతున్నాయి.
దీనివలన వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇంటిపని, వంటపని, బయటి పని చేసుకుంటూకూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయినాకూడా వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే కొన్ని అంతర్లీనమైన వ్యాధులు బాధిస్తుంటాయి. ఇవి వారి శరీరంలోనే పొంచి వుంటాయి.
ముఖ్యంగా పగలు ఎక్కువసేపు ఇంట్లో పని చేసి, కార్యాలయంలో కంప్యూటర్ ముందుకూర్చుని తదేకంగా పని చేసినప్పుడు వారు బాగా అలసిపోతుంటారు. ఇలా అలసిపోయినప్పుడు ఇంటికి వచ్చే సమయంలో వారి కళ్ళు మూతపడుతుంటాయి.
దీనికంతటికి కారణం ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని తదేకంగా కంప్యూటర్ స్క్రీన్ పై ఉన్న విషయాన్ని చదివి, వాటికి సంబంధించిన ఉత్తరాలను అందివ్వడం మూలాన కళ్ళు బాగా అలసిపోయి విశ్రాంతిని కోరుకుంటుంటాయి.
కాని ఈ అలసటను నివారించేందుకు కొన్ని చిట్కాలు...ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం నివారించుకోవాలి. అంటే కాసేపు కళ్ళకు విశ్రాంతిని ఇవ్వాలి.
అలాగే మీరు ప్రధానంగా కంప్యూటర్‌తో పని చేసే సందర్భంలో మీరు పనిచేసే స్థలంలో వెలుతురు ఎక్కువగా లేకపోయినా, విశ్రాంతి తీసుకోకుండా పనిచేసినాకూడా మీకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
ఒకే ముద్రలో కూర్చుని పనిచేయడం, సరిగా కూర్చుని పని చేయకపోవడం, మీరు వాడే కుర్చీ సరిగా ఉండకపోవడంలాంటివి మీ అనారోగ్యానికి మూల కారణాలుగా చెబుతున్నారు వైద్యులు.
దీంతో మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, చేతులు నొప్పి పుట్టడంలాంటివి వస్తుంటాయి. ఇవి కాకుండా ఫోన్, కీ-బోర్డు, మౌస్ తదితరాలను వాడే పద్ధతిలో వాడకుండా ఉండటం, ఎక్కువ సమయం నిలిచి ఉండి పని చేయడంకూడా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది.
దీనికి కారణం నడుము నొప్పి, మస్కులర్ స్కెలెటన్ కారణంగా మెడ నొప్పి, కాళ్ళు, భుజాలలో నొప్పులు రావడంలాంటి బాధలుంటాయి. కాబట్టి ప్రతి రోజూ మనసును ఏకాగ్రతతో ప్రశాంతంగా ధ్యానం చేసుకుని పని చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు దరిచేరవని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో నొప్పులు ఎక్కువగా ఉన్నాయని నొప్పి నివారణా మందులు ఎక్కువగా తీసుకుంటే అసలుకే మోసం వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. |