ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > చనుమొనలు నల్లగా ఉంటే అబ్బాయే పుడతాడా...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చనుమొనలు నల్లగా ఉంటే అబ్బాయే పుడతాడా...?
FILE
గర్భిణీలో చనుమొనలు నలుపు రంగుకు మారితే వారికి మగబిడ్డ పుట్టడం ఖాయమని పూర్వీకులు బలంగా నమ్మేవారు. అంతేకాదు ఈ నమ్మకం ఇప్పుడు కూడా అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నది. అయితే బిడ్డ లింగ నిర్ధారణ అంచనాలో చెప్పే ఈ పద్ధతికి శాస్త్రీయమైన సాక్ష్యాలు లేవు.

గర్భధారణ ప్రభావాలలో చనుమొనలు నల్లబడటం ఒకటి మాత్రమే. గర్భధారణలో నలుపు రంగుకు మారిన చనుమొనలు తిరిగి సాధారణ రంగుకు రావు. ప్రొసెస్టరాన్ పెరుగుదల, మెలానోసైట్- స్టిమ్యులేటింగ్ హార్మోన్(ఇది చర్మం పిగ్మేంటషన్ ను క్రమబద్ధీకరిస్తుంది) గర్భిణీలలో చనుమొనల నల్ల రంగుకు కారణమవుతాయి.

చాలామంది గర్భిణీలపై ఇది మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భం దాల్చినప్పుడు చనుమొనలు మరింత నలుపు రంగుకు మారతాయి.

అలాగే గర్భిణీ ఉదరం ఆకృతిని బట్టి పుట్టబోయే పాపాయి లింగ నిర్థారణ చేయవచ్చనే నమ్మకం కూడా ఉన్నది. పై పొట్ట ముందుకు పొడుచుకుని వచ్చినట్లుంటే అబ్బాయి అనీ, కిందిపొట్ట పొడుచుకుని వస్తే అమ్మాయనే నమ్మకం ఉంది.

అయితే ఇది శాస్త్రీయంగా రుజువు కాలేదు. పాపాయి కింది పొజిషన్‌లో ఉంటే ఉదరం కిందికి ఉంటుంది. అలాగే పాపాయి కదలిక పైకి ఉన్నప్పుడు విశాలంగా కనిపిస్తుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కంప్యూటర్‌తో శారీరక రుగ్మతలు...!
మహిళలూ...మీ వంటగది ఎలాగుంది...?
ఊబకాయాన్ని తగ్గించండిలా...!
గర్భావస్థలో ఫిజియోథెరపీ...!
సహజ "సన్‌స్క్రీన్"లు పండ్లు...!!
గర్భనిరోధానికి బియ్యం ఓ ఔషధం...!