ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భద్రత కల్పించే ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) విభాగంలో తొలిసారి ఒక మహిళకు స్థానం దక్కింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ మహిళా అధికారిణి బినితా ఠాగూర్ ఈ అరుదైన అవకాశం చేజిక్కించుకున్నారు. జూన్ ఆరో తేదీన 40వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న బినితా ఠాగూర్‌కు దేశంలోని అత్యున్నత వ్యక్తులకు భద్రత కల్పించే విభాగంలో సేవ చేసే అవకాశం దక్కడం.. ఇంతకుముంచిన పుట్టిన రోజు బహుమతి ఇంకేముంటుందని ఆమె అంటున్నారు.
1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బినితా.. ఎస్.పి.జీలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని భద్రతా వాహన శ్రేణి వెళ్లే సమయంలో రెండో శ్రేణిలో ఆమె విధులు నిర్వహిస్తారు. ప్రస్తుతం జైపూర్ ట్రైనింగ్ కేంద్రంలో అసిస్టెట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న బినితా ఠాగూర్.. జువాలజీ శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తోంది. |