ప్రతి ఒక్కరు తమతోటివారితో చాలా తెలివైనవారిలా వ్యవహరించాలని అనుకుంటుంటారు. అలాగే తమ స్నేహితులు తెలివైనవారిలా ఉండాలనికూడా కోరుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలు పురుషులపై ఎక్కువ ఫిర్యాదులు చేస్తుంటారు. కాని వారు వీరి మాటలను సుతారమూ లెక్క చేయరు. అందునా పురుషులు ఏం చేస్తున్నారనేదాని గురించి పెద్దగా పట్టించుకోరు. దీనికే భార్యా-భర్తల మధ్య లేదా గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్‌ల మధ్య వాదోపవాదాలు పెరిగి మనస్పర్థలకు దారి తీస్తుంటుంది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే...పురుషుల సాధారణమైన అలవాట్ల గురించి. అవి వారికి సాధారణంగానే అనిపిస్తాయి. కాని ఇతరులకు అసాధారణంగా ఉంటాయి. అసౌకర్యంగాకూడా ఉంటాయి. ఇలాంటి అలవాట్లు ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు లేదా ఇద్దరిలో కనపడుతుంటాయి.పురుషుల సాధారణమైన అలవాట్లు :** కొంతమంది పురుషులు శరీరంపై కేవలం బనియన్ లేదా తువాలుతోనే బయట తిరుగుతుంటారు. ఇది వారికి అసౌకర్యంగా అనిపించదా...! ఎందుకిలా చేస్తారు. ఎంచక్కా చొక్కా ధరించి రావచ్చుగదా అని కొందరు మహిళామణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ** కొంతమంది పురుషులు ఇంట్లో స్త్రీలకు ఎల్లప్పుడూ ఏదో ఒకటి పురమాయిస్తుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు నీళ్ళుకూడా ముంచుకు తాగరు. **ముఖ్యంగా మహిళలు అలంకార ప్రియులు. అలంకరించుకోవడం వారి నైజం. కాని పురుషులు అలా కాదు. మొఖం కడుక్కుని, తలదువ్వుకుని ఇంటినుంచి బయటకు వెళ్ళిపోతుంటారు. అప్పుడప్పుడు కొందరు పురుషులు షేవింగ్ కూడా చేసుకోరు. కాని స్త్రీల పరిస్థితి అలాకాదుకదా...!** కొంతమంది పురుషులు ఆరుబయటే మూత్రవిసర్జన చేసేస్తుంటారు. అది వారి అలవాటేమోమరి. ఈ అలవాటును మానుకోరా...!** కొంతమంది పురుషులు భోజనం చేసిన తర్వాత తమ స్త్రీల, గర్ల్‌ఫ్రెండ్ లేదా అమ్మకొంగుతో చేతులు తుడుచుకుంటుంటారు. ఇది వారి అలవాటేమో. దీనిని మానుకుంటే బాగుంటుంది. ** కొంతమంది పురుషులు భోజనం చేసేటప్పుడు శబ్దం చేస్తూ భోజనం చేస్తుంటారు. త్వరత్వరగా భోజనం చేసి తమ పని అయిపోయిందని అనుకుంటుంటారు. ఇలా ఎందుకు? ఎదుటివారి గురించికూడా పట్టించుకోవాలి.** కొందరు ఒకే ఒక్క జత బట్టలను కొన్ని రోజుల వరకు ధరిస్తుంటారు. అదే మహిళలైతే ప్రతి రోజు వారి దుస్తులు మార్చుకుంటుంటారు. కొందరు పురుషులు ఇలా ఎందుకు చేయరు. ** కొంతమంది పురుషులు, యువకులు ఎదుటి స్త్రీలను అదే రకంగా చూస్తుంటారు. వారు అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత వారిపై కామెంట్లు విసురుతుంటారు. ఇది మంచి పద్ధతేనా అని మహిళలు వాపోతుంటారు. |