చాలామందికి సౌందర్య పోషణ, శారీరక జాగ్రత్తలకు సంబంధించి కొన్ని అపోహలు నెలకొని ఉంటాయి. అవే నిజమని నమ్మేసి వాటిని ఇంచుమించు అందరూ అనుసరిస్తుంటారు. అలాంటివాటిలో కొన్నింటిని తెలుసుకుందాం...
కీరా: కీరాను గుండ్రంగా చక్రల్లా కోసి కళ్లమీద ఉంచుకుంటే కళ్లకింద ఉబ్బులు పోతాయని ఒక అపోహ ఉన్నది. నిజానికి కీరాలో 90శాతం నీరు ఉంటుంది. మిగిలినది పీచు. ఇది ఏ విధంగానూ చర్మానికి మేలు చేయదు. అయితే ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని కీరా చక్రాలను కళ్లమీద వుంచుకోవడం అందులోని చల్లదనం వాపును తగ్గిస్తుంది. అలాగే చల్లని తడి వస్త్రాన్ని కళ్లపై ఉంచుకున్నా ఇదే ఫలితాన్ని ఇస్తుంది.
తలకు నూనె: తలకు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందని, జుట్టు రాలడం తగ్గుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే నూనె రాసుకోవడం వల్ల కాక, నూనె మసాజ్ వల్ల మేలు కలుగుతుంది. మునివేళ్లతో మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. |