కొంతమంది యువతుల సౌందర్యానికి అపశృతుల్లా అందమైన శరీరంపై వెంట్రుకలు కొట్టొచ్చినట్లు కనపడుతుంటుంది. దీంతో చాలామంది సిగ్గుతో చచ్చిపోతుంటారు. పదిమందిలో తిరగాలన్నాకూడా వీరు కుచించుకుపోతుంటారు. సాధారణంగా చాలామంది స్త్రీలకు వెంట్రుకలుంటాయి. కొంతమందికి పల్చగా కనపడితే, మరికొంతమందికి కనిపించకుండా ఉంటాయి. మరికొందరికి స్పష్టంగా కనపడుతాయి. ఇలా ఎక్కువగా ఉంటే మగవారి శరీరంలా ఉంటుంది. ఇలాంటివారు ఎంత అందంగా ఉన్నాకూడా ఈ లోటు అందాన్ని తగ్గించేస్తుంది. దీంతోపాటు ఇలాంటివారు మానసికంగా కృంగిపోతుంటారు. దీనికి పరిష్కారం వెంట్రుకలను తొలగించడమే. దీనికి నాలుగు రకాల పద్ధతులున్నట్లు బ్యుటీషియన్లు చెపుతున్నారు.** ఎలక్ట్రాలసిస్,** త్రెడ్డింగ్,** బ్లీచింగ్,** వ్యాక్సింగ్.** ఎలక్ట్రాలసిస్ : ఎలక్ట్రాలసిస్ అనేది పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో బ్యుటీషియన్లు చేస్తుంటారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే డబ్బుతో కూడుకున్నది. ఇంతగా కష్టపడి చేసుకున్నాకూడా మళ్ళీ వెంట్రులు వస్తాయి. ** త్రెడ్డింగ్ : త్రెడ్డింగ్ అనేది చాలా తేలికైన పని. దీనిని ఎవరికివారే స్వయంగా చేసుకోవచ్చు. దీంతో కనుబొమలను అందంగా తీర్చిదిద్దొచ్చు. త్రెడ్డింగ్ చేయించుకుంటే వెంట్రుకలు వేగంగా పెరుగుతాయని అపోహలు చాలామందిలో ఉంది. అలాగేం జరగదని బ్యుటీషియన్లు చెపుతున్నారు. ** బ్లీచింగ్ : బ్లీచింగ్ పద్ధతిలో ఇంట్లోనే వెంట్రుకల రంగును మార్చుకోవడం ద్వారా వాటిని తాత్కాలికంగా కన్పించకుండా చేయవచ్చు. ఇలా చేయడం వలన చర్మంపై డెడ్ స్కిన్ రాలిపోవడమే కాకుండా వెంట్రుకలు రంగు మారడంద్వారా కనుమరుగై చర్మపు కాంతి పెరిగి ఛాయ వస్తుందంటున్నారు బ్యుటీషియన్లు.** వ్యాక్సింగ్ : పైన పేర్కొన్న అన్ని విధానాల్లోకెల్లా ఈ పద్ధతి ప్రాచుర్యం పొంది ఉంది. ఈ పద్ధతితో వెంట్రుకలను తొలగించేటప్పుడు దీని వలన శరీరానికి కొంచెం నొప్పివున్నాకుడా ఎలాంటి నష్టం కలగించదు. నిత్యం ఈ పద్ధతిని పాటించటం మూలాన వెంట్రుకల పెరుగుదల చాలా వరకు అరికట్టవచ్చంటున్నారు వైద్యులు. |