బరువు పెరగడం, శరీరం లావుగా మారడం అనేది ఓ జబ్బులాంటిది. శరీరం లావుగా మారడమనేది ప్రస్తుత ఆధునిక జీవనశైలే కారణం అంటున్నారు వైద్య నిపుణులు. ఉరుకుల పరుగుల జీవితంలో ఏది దొరికితే అది తినడం కారణంగా శరీరం లావుగా పెరిగిపోతుంటుంది. దీంతో వివిధ రకాల జబ్బుల బారిన పడుతుంటారు. అందునా ప్రత్యేకంగా మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచరు. ఆరోగ్యంగా ఉంటూ శరీరం లావుగా ఉండకుండా చూసుకునేందుకు మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఊబకాయం పెరగడంతో మధుమేహం, హృద్రోగం తదితర రోగాల బారిన పడుతారంటున్నారు వైద్యులు. క్యాలరీలు : ప్రతి వ్యక్తి తన శరీరానికి రోజుకు 2వేల క్యాలరీల శక్తిని ఆహారపదార్థాల ద్వారా అందివ్వాల్సి ఉంటుంది. కాని ఇదంతాకూడా వారివారి శారీరిక బరువు, వయసు, ఎత్తు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. మహిళలు మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా పండ్లు, కాయగూరలుండేలా చూసుకోండి. దీంతో శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు, మినరల్స్, ఫైబర్, విటమిన్ తదితరాలు అందేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో అత్యధికంగా నీరుంటుంది. అంటే శరీరంలో దాదాపు 75శాతం నీరు ఉంటుంది. ఇది పౌష్టిక ఆహారంలో భాగమే. మీరు తీసుకునే నీటితో శరీరంలోని కాలేయం పరిశుభ్రమవుతుంటుంది. కాబట్టి ప్రతి మనిషికూడా ఎక్కువగా నీరు తాగుతుండాలంటున్నారు వైద్యులు. తీపి పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. శరీరాన్ని లావుగా చేయడంలో చక్కెర ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఉప్పును ఎక్కువగా తీసుకోవడంమూలాన ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్యులు అన్నారు. ఇవి రెండుకూడా ఊబకాయ పెరిగేందుకు దోహదపడతాయని వైద్యులు తెలిపారు. |