ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » కథనాలు » ఆధ్యాత్మిక మహిళల్లో ఆ... కోరికలు ఎక్కువేనట! (Divine | Thoughts | Women | Sex desire)
 
FILE
సాధారణంగా ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు కలిగి, పూజలు, వ్రతాలు చేసే మహిళల్లో కామప్రవృత్తి చాలా తక్కువగా ఉంటుందనుకుంటాం. వీరికి ఆ వాసనలంటే పడవని చాలామంది అనుకుంటుంటారు.

కాని ఒక తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే... ఆధ్యాత్మికతవైపు మళ్ళిన యువత, ముఖ్యంగా మహిళల్లో సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయనేది సారాంశం. అందునా యుక్తవయసులోనున్న మహిళల్లో ఈ వాసనలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెపుతున్నారు.

ఆధ్యాత్మికపరమైన జీవితం సెక్స్ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు కెంటుకీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. వారు నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 353 మంది డిగ్రీ చదివే విద్యార్థులు పాల్గొన్నారు.

వీరిలో ఎక్కువమంది అమ్మాయిలే ఉండటం గమనార్హం. వీరిలో పురుషులు చాలా వరకు సంయమనం పాటిస్తారని అదే మహిళల్లో సెక్స్ కోరికలు బలీయంగా ఉంటాయని తమ పరిశోధనల్లో తేలినట్లు పరిశోధనకారులు తెలిపారు.

ఇదిలావుండగా భారతదేశంలోని ఎక్కువమంది మహిళలు పూజలు, వ్రతాలు చేస్తుంటారు. వీరిలో ఇలాంటి కోరికలు బలీయంగా ఉండటమేనని పరిశోధకులు చెపుతున్నారు. నిత్యం వ్రతాలు, పూజలతో సతమతమౌతుంటే తమలో ఆ... కోరికలుండవని జనాలు భావిస్తారని, నిజానికి కామకోరికలు ఎక్కువగానే ఉంటాయని తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

కాగా మహిళలు ఎక్కువగా ఎరుపు, తెలుపు రంగు కలిగిన వస్త్రాలనే ఎన్నుకుంటారని, ఇందులోనే వారికి ఉన్న ఇష్టతనుబట్టి అర్థమౌతుందని, తరువాతి స్థానం పసుపురంగుకు ఇస్తారని పరిశోధకులు తెలిపారు. ఎరుపు, తెలుపు రంగు దుస్తులు కామనాడులను ప్రేరేపిస్తాయని వారు తెలిపారు. ఆధ్యాత్మికంలోనే మోహం, కామం దాగివున్నాయని వారు సూచించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.