ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాకున్న ప్రజాకర్షణ మరెవ్వరికీ లేదంటే అతిశయోక్తి కాదు. కాని అతనికి ఇంట్లోనే ప్రత్యర్థి తయారైనారు. అదెవరంటే తన శ్రీమతి మిషేల్ ఇప్పుడు తాజాగా తనకే పోటీకి రావడం గమనార్హం.
యూఎస్ఏ టుడే/ గైల్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఒబామా సతీమణి మిషేల్ ఒబామాకన్నా కూడా ముందుండటం గమనార్హం, మిషేల్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కన్నా ఎక్కువ శాతం ఓట్లు పోలైనట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు.
తాము నిర్వహించిన ప్రజాకర్షణకు సంబంధించిన సర్వేలో ఒబామాకు 55 శాతం ఓట్లు లభించగా, 42 మంది నిరాకరించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. అదే నిరుడు నవంబర్ ఐదునన అమెరికా అధ్యక్షుని ఎన్నికల తర్వాత ఒబామాకున్న ప్రజాకర్షణ 68శాతం లభించింది.
సర్వేలో అమెరికా ప్రథమ మహిళ మిషేల్‌కు జనాకర్షణ గ్రాఫ్‌లో 61 శాతం ఓట్లు లభించింది. అదే ఆమెకు ప్రజాకర్షణ లేదన్నవారి సంఖ్య కేవలం 25 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. తాము నిర్వహించిన సర్వేలో 1,521 మంది పాల్గొన్నట్లు సర్వే చేపట్టిన నిర్వాహకులు తెలిపారు.