నడుము భళే.... నడక భళే... అంటూ మన తెలుగు సినీ కవులు మహిళల నడకపై ఎప్పుడో కవితలు, పాటలు రాశారు. అంతే కాదు వాలు జడపై వారు రాసిన సినీగీతాలు కూడా హిట్ అయ్యాయి. సినీ రచయితలు తమలోని రసరమ్యతను బయటపెట్టారు. వయసులోని మహిళలను విశ్లేషణ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. అయితే వాషింగ్టన్‌కు చెందిన సెక్సాలజిస్టులు తాజాగా మహిళల్లో లైంగికతకు, నడకకు ఉన్న సంబంధాలపై పరిశోధనలు చేశారు. ఇందులో మహిళలలో నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చునని తేల్చారు. స్కాట్‌ల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టూవర్ట్ బ్రాడీ అనే పరిశోధకుడు తన సహచరులతో కలిసి ఈ పరిశోధన చేశారు.