శరీరంలోని హార్మోనులు సాధారణమైన వేగంతో కాకుండా మరింత వేగంగా పనిచేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి తాత్కాలికమయితే పర్వాలేదు కానీ ఆ ఒత్తిడి నిరంతర ప్రక్రియ అయితే ఆ హార్మోనులు శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హాని కలిగిస్తాయి. కనుక మీపై గల ఒత్తిడిని తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. ఇంకా కొన్ని సూచనలు పాటిస్తే ఒత్తిడిని సునాయాసంగా తగ్గించుకోవచ్చు.