తల్లిపాలకు ప్రత్యమ్నాయం ఇప్పుడు డబ్బా పాలైపోయింది. డబ్బా పాల వ్యాపారం బాగా ఎక్కువైపోతోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పిల్లలకు తల్లిపాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రసవానికి ముందుగానీ, ప్రసవం తర్వాత గానీ తల్లి ఎటువంటి మానసిక ఆందోళనలకు గురికాకూడదు. పూర్తిగా విశ్రాంతిగా, ఉల్లాసంగా ఉండాలి. గర్భిణిగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.