ప్రధాన పేజి   ఇతరాలు  మహిళ  సౌందర్యం
 
నాజూకుతనానికి ఏడు సులువైన మార్గాలు
ఏమాత్రం ఆకలి చంపుకోకుండా కొన్ని రకాలఆహార పదార్థాలు కడుపునిండా తినే వీలున్న పద్దతిని పాటిస్తే బ్యూటీ పార్లల్‌ చిట్కాలతో పనిలేకుండా బరువు తగ్గించుకుని నాజాకుతనాన్ని సాధించవచ్చు. నూనెలు, వేపుళ్లు, పాలు, చక్కెర వంటి వాటికి కొంత కాలం పాటు పూర్తిగా దూరమై సహజ పదార్ధాలను తీసుకుంటే సన్నదనం మన చేతుల్లో వున్నట్లే లెక్క.

కేవలం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సూప్స్, రోజువారి పచ్చళ్లు, రాగి జావ, జొన్న రొట్టి, మజ్జిగ లాంటి పదార్థాలతో కడుపునిండా తినే వీలున్న ఏడు దశల ఆహార పద్దతిని కొనసాగిస్తే నాజూకు తనం మీ సొంతమైనట్లే. ఈ పద్దతిని పాటించే క్రమంలో టీ, కాఫీ లాంటివి కూడా చక్కెర లేకుండా కాస్త ఉప్పు వేసుకుని తాగటం అలవాటు చేసుకోవాలి.

గ్రీన్‌ టీని చేసుకుని తాగితే మరీ మంచిది. టీ, కాఫీలలో చేసే ఈ కొద్ది మార్పులతో శరీరంలో ఫ్రీరాడికల్‌‌సను వదిలించి శరీరానికి జీవకళను పెంచుతాయి. మరి ఈ ప్రక్రియ కథా కమామిషు ఏమిటో చూద్దామా మరి.

పండ్లు : ఈ ఏడు దశల ఆహార పద్దతి పాటించేటపుడు మామూలుగా అందుబాటులో వుండే ఫలాలనే తీసుకోవచ్చు. వీటిలో తర్బూజా, పుచ్చకాయ, బత్తాయి, కమలా ఫలం, సపోటా, పనస, అరటిపండు, జీడిపండు, అత్తిపండు, మేడిపండు, రేగిపండు, మామిడి, దానిమ్మ, ఆపిల్‌ నారింజ దానిమ్మ వంటి ఫలాలను తీసుకోవచ్చు.