శిరోజాలకు అతిగా హెయిర్ కండిషనర్ వాడకూడదంటున్నారు. బ్యూటీ నిపుణులు... హెయిర్ కండిషనర్ శిరోజాలు ఆరోగ్యంగా, మృదువుగా నిగనిగలాడేలా చేస్తుంది. బలహీనమైన, చిట్లి పోయిన శిరోజాలకు ఈ కండిషనర్ వాడటం సరే, కానీ అతిగా వాడితే మాత్రం కొందరికి శిరోజాల్లో సమస్యలు తలెత్తవచ్చు. ఇలా కాకుండా హెయిర్ కండిషనర్ రాసే టప్పుడు కొన్ని పద్ధతులను పాటిస్తే ఈ సమస్యలనుంచి తప్పుకోవచ్చు.
ఇందులో మీ కోసం కొన్ని.... కండిషనర్ జుట్టు కుదుళ్ల నుంచి రాయటం చేయకూడదు. ఈ విధానం ద్వారా శిరోజాల మూలం బలహీనం చేస్తుంది. ఫలితంగా తేమను కోల్పోవటం కూడా చేస్తుంది. తేమను కోల్పోవటం ద్వారా పొడి బారినట్లు శిరోజాలు జీవం లేనట్లు తయారవుతాయి.
అందుకే కడిషనర్‌ను అప్లై చేసేటప్పుడు కుదుళ్ల నుంచి కాకుండా కాస్త పై నుంచి జుట్టు చివరి వరకు రాసుకోండి. తర్వాత మునివేళ్లతో మృదువుగా కుదుళ్ల నుంచి మర్దన చేసుకుని పదినిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో తల స్నానం చేయండి. ఈ విధానం ద్వారా వెంట్రుకలు చిట్లిపోకుండా తేమను కోల్పోకుండా జీవంగా ఉంటాయి. అంతేకాకుండా శిరోజాలు మృదువుగా నిగనిగలాడుతాయి.
|