సౌందర్యం పట్ల కొందరు మహిళలు అధిక శ్రద్ధ తీసుకుంటారు. మరి కొందరు మహిళలు ఎలాంటి విధానాలను వాడాలని తెలియక ఏదో తెలిసిన మేరకు శ్రద్ధ చూపుతారు. ఇలాంటి వారి కోసం కొన్ని సౌందర్య చిట్కాలు... చర్మ సౌందర్యం కోసం అధికంగా పండ్ల రకాలను, జ్యూస్‌లను ఉదయం, సాయంత్రం తీసుకోవటం ద్వారా చర్మ ఛాయ పెంపొందుతుంది. వీటితో పాటు ఐస్‌క్రీమ్‌లను కూడా రెండు రోజులకొకసారి తినడం ద్వారా చర్మం మృదువుగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
స్నానానికి ఘాటు సబ్బులను వాడటం మంచిది కాదు. అధికంగా రసాయనిక పదార్థాలతో తయారుకాని వాటిని వాడటం మంచిది. స్నానానికి బాగా వేడిగా ఉంటే నీటిని వాడకూడదు. గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. బాగా వేడిగా ఉంటే నీటితో స్నానం చేస్తే చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. బాగా వేడయిన నీటితో స్నానం చేస్తే చర్మ రంధ్రాలు తెరుచుకుని తేమ ఆవిరై చర్మం డీ హై డ్రేషన్‌కు గురవుతుందని వైద్యులు చెబుతున్నారు.
గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. బాగా వేడిగా కావలనుకున్న వారు షవర్లో స్నానం చేయకండి. అలా చేసిన ఎక్కువ సేపు వేడినీటితో స్నానం చేయకండి. వేడినీటితో స్నానం చేసిన వెంటనే చల్లని నీటిని పోసుకోవాలి. ఇలా చేస్తే చర్మ రంధ్రాలు మూసుకుని శరీరం కాస్త తడిపొడిగా ఉంటుంది.
|