శిరోజాల సంరరక్షణపై యువతరం అధికంగా ఆసక్తి చూపడం సహజమే. అంతేకాకుండా వర్కింగ్ ఉమెన్స్, హౌస్‌వైఫ్స్ అందరూ శిరోజాల సంరరక్షణలో ఎక్కువగా శ్రద్ధ చూపుతుంటారు. ఇలాంటి వారికోసం పట్టులాంటి శిరోజాలకు కొన్ని చిట్కాలు... రోజూ తలస్నానం చేసేవాళ్లు ఎక్కువ ఘాటు షాంపులను వాడకూడదు. తక్కువ గాఢత గల షాంపూలనే ఎంచుకోవాలి.
తలలో జిడ్డు పేరుకుందని అనిపించినా, చికాకుగా అనిపించినా వెంటనే స్నానం చేసేయండి. పొడి చుట్టుకు వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. హయర్ డ్రయర్లను వాడే ముందు కాస్త జాగ్రత్త వహించండి. వీటి వాడకం వల్ల జుట్టు చిట్లిపోయే అవకాశముంది.
వీలైనంత వరకు సాధారణంగా ఆరబెట్టేందుకు ప్రయత్నించండి. జుట్లు చిట్లుతుంటే చిట్లినంత మేర నెలకు రెండు సార్లు కత్తిరిస్తూ ఉండటం మంచిది. జుట్టుకు రంగువేసుకోవాలని అనుకుంటే ముందుగా కొంత జుట్టుకు రంగువేసుకోండి. అది సరిపడేలా అనిపిస్తే అదే రంగును వాడుకోండి. సమ్మర్లో జుట్టుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి. మీరు వాడే హెయిర్ జెల్స్‌లో సన్‌స్క్రీన్ కూడా ఉంటే ఇంకా మంచిది. జల్స్‌ను రోజూ వాడొద్దు. హెన్నా లాంటి సహజమైన డైలనే వాడండి.
|