చర్మ సౌందర్యంపై నేటి యువతరం ఎంతగానో జాగ్రత్త పడుతుండటం తెలిసిన విషయమే. మరి పంచదారలో చర్మ రక్షణ అంశాలు ఎంతవరకు ఉన్నాయని తెలుసుకుందామా? పంచదార మృతకణాలను నశింపజేస్తుందని బ్యూటీషియన్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుందని వారు చెబుతున్నారు.
మరీ పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకునే విధానం మీ కోసం... పావు కప్పు ఆలివ్ నూనెలో అరకప్పు ముదురు రంగు చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి పంచదార అణువులు కరిగే వరకు రుద్దితే మృత కణాలు తొలగిపోవడంతో పాటు చర్మ మృదువుగా, తేమగా ఉంటుంది.
చర్మసౌందర్యంతో పాటు బాక్టీరియాను హరింపజేసే లక్షణం కూడా పంచదార కుందని న్యూట్రీషియన్లు పేర్కొంటున్నారు. గాయాలను మాన్పడం, ఇన్ఫెక్షన్లను తొలగించే నివారిణిగా పంచదార ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. ఇక చర్మాన్ని బిగుతుగా ఉంచే యాంటీ ఏజింగ్ క్రీముల్లో తేనెను వాడతారు. ముఖం మీద మచ్చలకు కూడా తేనెను వాడుతారని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
|