మహిళలు శిరోజాల పట్ల మెలకువలను పాటిస్తుంటారు. శిరోజ సంరక్షణకు ఆయిల్స్, షాంపూల ఉపయోగంలో జాగ్రత్త వహిస్తుంటారు. నాగరికత అభివృద్ధి చెందడంతో ప్రస్తుతం జుట్టుకు రంగులు వేసుకోవడం వంటివి మామూలైపోయింది. అందమైన శిరోజాల కోసం ఓ చిట్కా...
"ఎండిన ఉసిరికాయ పొడిలో, ఒక టేబుల్ స్పూన్ గోరింటాకు, మెంతులపొడిని కలపండి. ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిపాలను కలపండి. షాంపూలా ఈ మిశ్రమాన్ని కలుపుకుని శిరోజాలను పట్టించి ఒక గంటపాటు ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే రెండు నెలల్లో నల్లటి, దట్టమైన, అందమైన శిరోజాలు మీ సొంతం.
|