ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > సౌందర్యం
 
మేకప్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు
ఫౌండేషన
ఫౌండేషన్ వేసుకుటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఫౌండేషన్ ఎంచుకునేటప్పుడు చర్మానికి దగ్గరగా ఉండే రంగును ఎంచుకుంటే మరింత అందంగా కనబడే అవకాశముంది. అందుకు ముందుగా ఒక చుక్క ఫౌండేషన్‌ చేతిపైన వేసుకుని చూడాలి. కొంత సేపటి తర్వతా అది చర్మంలో కలిసిపోతే దానిని శరీర వర్ణనికి దగ్గరగా ఉందని భావించ వచ్చును.

బ్లష
చర్మం అసలు రంగులోనే మరింతగా మెరుపును సంతరించేదుకు వాడే విధానన్ని `బ్లష్` అని అంటారు. దవడ ఎముకలపై మీకు నప్పే రంగు బ్లష్ అనవసరమైన మేరకే తీసుకుని ఎక్కడా ఎక్కువ తక్కువలు కాకుండా బ్రష్ సాయంతో సమంగా వేసుకోవాలి. చర్మరంగును పోలిన లూజ్ పౌడర్ లేదా కాంపాక్ట్ పౌడర్ రాసుకున్నా సరిపోతుంది.

ఐ షాడ
మహిళలలో చాలామందికి ఐ షాడో ఎలా వేసుకోవాలనే విషయంపట్ల అవగాహన ఉండదు. ఐ షాడో వేసుకున్నా తర్వతా, ఎక్కువైంది అని మీకు అనిపిస్తే బ్రష్‌తో మృదువుగా తొలగించండి. లేదంటే మీ చర్మానకి దగ్గరగా ఉండే ఫౌండేషన్ ఓ చుక్క వేసి రాయండి. అప్పుడు ఐ షాడో రంగు తగ్గుతుంది.

ఐ లైనర
ఐ లైనర్ వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా సమయంలేనప్పుడు ఐ లైనర్ ఉపయోగించకపోవటమే మంచిది. హడావుడిగా ఐ లైనర్ ఉపయోగిస్తే రెండూ కళ్లు రెండు రాకాలుగా కన్పించే అవకాశం ఉంది. లేత ఛాయలో ఉండే ఐ లైనర్ వేసుకోండి. ఎక్కడైన ముద్దగా వచ్చినట్లు కనిపిస్తే స్పాంజితో తుడిచేయండి.

మస్కార
నయనాల అందాలను మరింత వన్నేతెచ్చే మస్కారాను అవసానికి మించి వాడితే ఎబ్బేట్టుగా ఉంటుంది. మస్కారా బాటిల్‌ను ఏటవాలుగా వంచి మస్కారా స్టిక్‌తో కొద్దిగా అద్దుకొని ఒకటికి మించి కోటింగులు వేస్తునట్లయితే మొదటి కోటింగ్ పూర్తిగా ఆరేవరకు రెండోది వేయకూడదు.

ఐబ్రో కలర
ఐబ్రో పెన్సిల్‌తో కనుబొమలు దిద్దుకునేవారు అవసరానికిమించి లేదా సరిపడనంత కాకుండా చూసుకోవాలి. కనుబొమల రంగు జట్టు రంగు ఒకే విధంగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.
మరిన్ని
సెంటును వాడటంలో జాగ్రత్తలు
శిరోజ సంరక్షణకు చిట్కాలు
పంచదారతో చర్మ సౌందర్యం
సామాన్యులకు చేరువలో కాస్మొటిక్ సర్జరీ
అందమైన నవ్వుకు ఆరోగ్యకరమైన దంతాలు
చర్మం ముడతలు పడుతుందా?