ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > సౌందర్యం
 
అందమైన పాదాల కోసం...
ఆరోగ్యకరమైన పాదాలు అతివకు అందాన్ని తీసుకువస్తాయి. ఆ యువతి ఆ'పాద'మస్తకం సౌందర్యశోభితం అని కవులు ఊరకనే అనలేదు. అందుకే మీ పాదాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చే చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము.

పాదానికి మద్దతునిచ్చే పాదరక్షలను ధరించండి, తద్వారా గాయాల నుంచి దూరంగా ఉండవచ్చు.
ప్రతిరోజూ ఒకే రకం షూలను ధరించకండి.
సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన పాదరక్షలు మీ పాదాలు ఊపిరి పీల్చుకునేలా చేస్తాయి.
చెప్పుల తయారీలో చూపించే చిన్నపాటి తేడా మీ పాదానికి ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాక ఆ ఇబ్బంది యావత్ శరీరానికి సంక్రమించే ప్రమాదం ఉంది.

సాక్సులను ప్రతిరోజూ మార్చండి. డెబ్బై శాతం కాటన్ లేదా ఉన్నితో తయారైన సాక్సులను వాడండి. చేతివృత్తుల వారు రూపొందించిన నారతో తయారైన సాక్సులు, చర్మంపై స్వేదాన్ని తొలగించి, చర్మాన్ని పొడిగా ఉంచడమేకాక దుర్వాసనను దరిచేరనీయవు.

ఒకేరకం హీల్స్ పాదరక్షలను ప్రతిరోజూ ధరించకండి. ఒక రోజు హైహీల్స్, ఒకరోజు లోహీల్స్ మరియు ఒకరోజు కొద్దిపాటి హైహీల్స్ ధరించండి.
రోజువారి వాడకానికై, హీల్ ఎత్తు దాదాపు రెండు సెం.మీలు ఉండేలా చూసుకోండి.మధుమేహ వ్యాధి కలవారు తమ పాదాల పట్ల మరింత శ్రద్ద చూపించాలి.
పాదానికి చురుకుదనం తెచ్చేందుకు ఫీట్ రోలర్‌తో మాసాజు చేయండి.
మీ పాదం మీ శారీరక ఆరోగ్యానికి అద్దం పడుతుందన్న సంగతిని మరువక పాదాల పట్ల జాగ్రత్త వహించండి.
మరిన్ని
మేకప్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు
సెంటును వాడటంలో జాగ్రత్తలు
శిరోజ సంరక్షణకు చిట్కాలు
పంచదారతో చర్మ సౌందర్యం
సామాన్యులకు చేరువలో కాస్మొటిక్ సర్జరీ
అందమైన నవ్వుకు ఆరోగ్యకరమైన దంతాలు