ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > సౌందర్యం
 
చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఆరంజ్ జ్యూస్
పండ్ల రసాలను తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలు చేకురుతాయని వైద్యులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని పండ్లు చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడుతున్నాయని బ్యూటిషన్లు చెబుతున్నారు. ఇందులో ఆరంజ్ జ్యూస్‌ చర్మ సౌందర్యాన్ని రెండింతలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు.

ఇక నారింజ పండులోని సౌందర్య చిట్కాలను పరిశీలిస్తే... ఆరంజ్ జ్యూస్‌ను ఉదయం, సాయంత్రం పూటల్లో చెరో గ్లాసు తీసుకోవటంతో చర్మానికి సౌందర్యం, కోమలత్వం చేకూరుతుందని బ్యూటిషన్ల సూచన. నారింజ తొక్కలను ఎండబెట్టి పౌడర్ చేసుకుని రోజు రెండు స్పూన్లు చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

అంతేకాకుండా ఆరంజ్ జ్యూస్‌ను ఫ్రీజర్లో ఉంచి గట్టిగా తయారయ్యాక ఓ తెల్లని వస్త్రంలో కట్టి కంటి రెప్పలపై ఐదు నిమిషాల పాటు ఉంచితే కంటికి కొత్త అందం చేకూరుతుంది. ఇలా రోజు మార్చి రోజు చేస్తే మీ కళ్ళు ఇతరుల్ని ఆకట్టుకునే విధంగా తయారవుతాయని బ్యూటిషన్లులు అంటున్నారు.
మరిన్ని
అందమైన పాదాల కోసం...
మేకప్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు
సెంటును వాడటంలో జాగ్రత్తలు
శిరోజ సంరక్షణకు చిట్కాలు
పంచదారతో చర్మ సౌందర్యం
సామాన్యులకు చేరువలో కాస్మొటిక్ సర్జరీ