టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్‌లోనూ పాగా వేసిన సెక్సీ తార అనుష్క తను పాటించే కొన్ని సూత్రాల ద్వారా అది సాధ్యమవుతుందని చెపుతోంది. వేసవిలో చర్మం పేలటం, శీతాకాలంలో పొడిబారి పగలటం వంటి సమస్యలు తనకు ఎట్టి పరిస్థితులలోనూ ఎదురవవని చెబుతోంది.
ఇదెలా సాధ్యం అని అడిగితే," వాతావరణంలో మార్పులు సహజం. ఆ మార్పులకు తగ్గట్లు మన అలవాట్లను మార్చుకోవాలి. నా మటుకు నేను సీజనల్ గా దొరికే పండ్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తాను. అలాగే శీతాకాలం.. వేసవి కాలం అని కాకుండా ఎల్లప్పుడూ యోగా చేస్తుంటాను.
ఇది చాలా ఉపయోగపడుతుంది. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పటికీ యోగా చేయటం వల్ల చర్మానికి ఎటువంటి సమస్యలు ఎదురవవు. చాలా మంది చర్మానికి ఏవేవో క్రీములు రాస్తుంటారు.. వాటికన్నా యోగా చేయటం మేలు" అని చెప్పింది యోగా మాస్టార్.... సెక్సీతార అనుష్క
|