ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్వల్ప వ్యవధిలో సౌందర్యానికి మెరుగులు..
పార్టీకి వెళ్తున్నారా.... మేకప్ వేసుకునేందుకు ఎక్కువ సమయం లేదా... అయితే అలాంటి సమయాల్లోను మేకప్ వేసుకునే వెసలుబాటు ఉంది... కేవలం రెండు నిమిషాల్లోపే మేకప్‌ వేసుకోవడం పూర్తి చేసి పార్టీకి దర్జాగా వెళ్లొచ్చు.

ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా... చదవండి మరి.. ముఖంపై మచ్చలు లేదా గుంతలు లాంటివి కనపడకుండా ఫౌండేషన్ వేసుకున్న తర్వాత కాంపాక్ట్‌ను వేసుకుంటే చర్మం మెరుస్తుంది... కనురెప్పలపై బ్రష్‌ను ఉపయోగించి ఐ షాడో వేసుకోవాలి... నల్లని ఐ లైనర్‌ను కంటి కొసలకు ఇరువైపులా వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదంతా కేవలం అరవై సెకన్‌లలోపు మాటే..

మరో అరవై నిమిషాల్లోగా.. చేతి వేళ్ల సహాయంతో గులాబి రంగు క్రీమును బుగ్గలపై అద్దితే, బుగ్గలు కాంతి వంతంగా మెరుస్తాయి. అయితే దీనికి ముదురు రంగులు కాకుండా తేలిక పాటి రంగులను ఎంచుకుంటే మంచింది..

మేకప్‌లో ముఖ్యాంశం పెదవులు.. ముందుగా లేత గులాబి రంగు లిప్ లైనర్ ఉపయోగించాలి. తర్వాత మీకు ఇష్టమైన రంగు లిప్‌స్టిక్‌ను లిప్‌బ్రష్‌ను ఉపయోగించడం కంటే చేతి వేళ్లు ఉపయోగిస్తే మరీ మంచిది.
మరిన్ని
క్రీమ్స్ వేస్ట్... యోగా బెస్ట్: అనుష్క
బొప్పాయి జ్యూస్‌తో చర్మంపై ముడుతలకు గుడ్‌బై
కళ్ల కింద చారలా... ఇవిగో చిట్కాలు
చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఆరంజ్ జ్యూస్
అందమైన పాదాల కోసం...
మేకప్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు