అందం మరులు గొలిపే మధుర మకరందం.. అన్నది ఓ కవి భావన. అందం కోసం ఆరాటపడని వారుండరు. అదీ వయసులో ఉన్న యువతీ, యువకులైతే అందంగా కనపడేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇతరులను ఆకర్షించే వాటిలో ముఖం ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ ముఖంపై మొటిమలు, నల్లనిమచ్చలు వంటివి ఉంటే... ఇవిగో ఈ చిట్కాలు పాటిస్తే సరి.. ముఖంపై మొటిమలతో పాటు ఇతర కాలిన, తెగిన గాయాలు ఏవైనా ఉంటే బంగాళాదుంపలను ఉడకబెట్టి ప్రతిరోజు ముఖానికి రాసుకుంటే...సరిపోతుంది. అంతే కాదు ముఖం కాంతివంతంగా కూడా కనపడుతుంది.
అలాగే మొటిమలు కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తి మీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసుకుని అర్ధగంట తర్వత చల్లటి నీటితో కడిగేస్తే కొంత మేరకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. మెడలో ఆభరణాలను వేసుకుంటున్నప్పుడు నల్లటి చారలు ఏర్పడటం సహజం.. ఈ నల్లటి చారల నుంచి విముక్తి పొందాలంటే నారింజ తొనలను గుజ్జుగా చేసుకుని మెడపై నల్లటి చారలున్న చోట సున్నితంగా మర్ధన చేస్తే సరిపోతుంది.
|