ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సహజత్వమే అందం
Natural Beauty
FileFILE
పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి నేటి యువతీయువకులు.. ఆ పద్ధతులను పుణికి పుచ్చుకుని పాటించడంలోను పోటీ పడుతున్నారు. ముఖ్యంగా..యువతీ యువకులతో పాటు వయస్సు మీద పడిన వారు కూడా ఈ తరహా పద్దతులపై ఆసక్తిని కనబరుస్తుండటం గమనార్హం.

ఇందులోభాగంగా.. ప్లాస్టిక్ సర్జరీలు, మేకప్‌లు, శిరోజాలకు రంగు వేసుకోవడం వంటివి సర్వసాధారణమై పోయాయి. సహజసిద్ధంగా ఏర్పడిన అందాని కంటే ఈకృత్రిమ అందాలు సహజత్వాన్ని ఇస్తాయా అన్నదే ప్రశ్న. ముక్కు ఆకారం సరిగా లేదని, పెదాలు తమకిష్టమైన నటీమణిలా ఉండాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు.. అంతా బాగానే ఉంది.. మరైతే మీ ఎదుట ఉన్న అద్దంలో కనపడేదెవరు..?

కనుక మీరు నలుగురిలో ప్రముఖంగా, అందంగా కనపడేందుకు... మీ కోసం మీరేమి చేయాలనుకుంటున్నారు...? అన్న విషయాలను మనసులో నిర్ణయించుకోవాలి.. మనం మరొకరిని అనుకరించడం కాక మనలోని సహజత్వ అందాన్ని ద్విగుణీకృతం చేయడం ద్వారా సమాజంలో ప్రాధాన్యతను పొందవచ్చంటున్నారు నిపుణులు.

ముక్కు ఆకారం సరిగా లేకున్నా.. అందమైన కళ్లకు మెరుగులు దిద్ది ఆ సమస్యను అధికమించవచ్చు. అలాగే శరీరాకృతి అందవిహీనంగా కనిపించినా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ శరీరవ్యాయామం చేయడం అద్భుతమైన ఫలితాలను చూడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని
ముఖంపై మచ్చలా..?
స్వల్ప వ్యవధిలో సౌందర్యానికి మెరుగులు..
క్రీమ్స్ వేస్ట్... యోగా బెస్ట్: అనుష్క
బొప్పాయి జ్యూస్‌తో చర్మంపై ముడుతలకు గుడ్‌బై
కళ్ల కింద చారలా... ఇవిగో చిట్కాలు
చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఆరంజ్ జ్యూస్