ఆఫీసులో మీ తొటి ఉద్యోగిని అందంగా ఉంది. ఎలాగో తెలసుకునేందుకు చొరవ చూపేంత ధైర్యం మీలో లేదు.. అలాంటప్పుడు ఇవిగో కొన్ని సూత్రాలు.. ప్రతి రోజు ఈ సూత్రాలను పాటిస్తే ఎదుటి వారిని ఆకట్టుకోవడంలో మీదే పైచేయి.
అందుకు మీరు చేయాల్సిందల్లా మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవడమే... తొలుత మీరు అందంగా కనపడాలంటే అందులో ముఖ్యంగా కురులు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి కనీసం రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం ఉత్తమం.
కొంతమందికి కురులు జిడ్డుగా ఉంటాయి అలాంటి వారు ప్రతి రోజు తలస్నానం చేయడం మరీ మంచిది. ఆ తర్వాత చేతి వేళ్ల గోర్లు అందంగా కట్ చేసుకుని వాటికి సరైన నెయిల్ పాలిష్ రంగులను వాడడం ఉత్తమం.
సూపర్ ఫ్యాషన్, మరీ స్టైలిష్‌గా ఉండే దుస్తులు ధరించటం కన్నా మీ స్టైల్‌కి తగ్గవి ఎన్నుకుంటే మీ అందాన్ని అవి ఇనుమడింపజేస్తాయి. అలాగే మీరు ధరించే దుస్తులు మరీ పొట్టిగా, మరీ పొడవుగా లేకుండా చూసుకోవాలి.
ఎందుకంటే మిమ్మల్ని అంచనా వేయడంలో మీ దుస్తులు ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి. అలాగే బాడీ షేప్ అందంగా, నాజూగ్గా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పని సరి. దీని వల్ల మొహంలోను ప్రస్పుటమైన కళ రావడమే కాక చూపరుల దృష్టిని ఆకర్షించగలరని నిపుణులు చెబుతున్నారు.
|