ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మీ చేతుల్లోనే మీ సౌందర్యం
FileFILE
ప్రతి ఒక్కరూ అందంగా కనబడాలని ప్రయత్నిస్తారు. అందుకోసం అనుసరించాల్సిన మార్గాలు ఏమిటా అని ఆలోచిస్తుంటారు. ఆ సౌందర్య చిట్కాల కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. అవి మీ చేతుల్లోనే ఉన్నాయి.

ప్రతి ఒక్కరిలోనూ ఆకర్షించగల ఓ ప్రత్యేక అంశం ఉంటుంది. దీనిని వెలికితీసి తగు జాగ్రత్తలు తీసుకుంటే అందరి దృష్టిని ఇట్టే ఆకర్షించగలుగుతారు. మీలో ఉన్న ఆ ప్రత్యేకతకు మెరుగులు దిద్దితే యవ్వనపు సౌందర్యం వికసించి ఆకర్షణీయంగా కనబడతారు.

దీనికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీ సౌందర్యాన్ని ఇనుమడింప జేయడంలో రోజు వారి కార్యక్రమాలు పాత్ర వహిస్తాయని తెలుసుకోండి. ఈ పనుల్లో తలెత్తే ఒత్తిడిని జయించగలిగితే ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఒత్తిడిని జయించాలంటే మనసుకు ఆహ్లాదపరిచే అంశాలపై దృష్టి సారిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఓ పది నిమిషాల పాటు వ్యాయామం చేయడం..లేదంటే ఓ పది నిమిషాల పాటు వేగంగా నడవటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతోపాటు సౌందర్యమూ సొంతమవుతుంది.

ముఖంపై మొటిమలు లాంటి సమస్యలు తలెత్తినప్పుడు... ఏవేవో ప్రయోగాలకు పోకుండా... మీ ఇంటిలో పెద్దవారు చెప్పిన పాత పద్ధతులను పాటిస్తే మేలని నిపుణులు తెలుపుతున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా.. మరి..!
మరిన్ని
ఆహార నియమాలతో అందం పదిలం
ప్రతిరోజు అందంగా..
సహజత్వమే అందం
ముఖంపై మచ్చలా..?
స్వల్ప వ్యవధిలో సౌందర్యానికి మెరుగులు..
క్రీమ్స్ వేస్ట్... యోగా బెస్ట్: అనుష్క