ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆరోగ్యవంతమైన కేశాలకోసం...
FileFILE
మారుతున్న కాలానికి తగ్గట్లు అందానికి గల ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. స్త్రీలే గాక పురుషులు కూడా అందం పట్ల మక్కువ చూపిస్తున్నారు. అందానికి మరింత వన్నె తెచ్చేది శిరోజాలు. కనుక కురులు అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడంకోసం అనేక రకాలైన పద్ధతులు నేడు అందుబాటులోకి వచ్చాయి.

ఖరీదైన షాంపూలు, హెయిర్ జెల్‌ల, కండీషనర్‌లు వంటి రసాయన పదార్ధాలతో కూడిన వాటిని కేశాలకు పట్టిస్తాం. అయితే ఇలాంటి రసాయన పదార్ధాలతో కూడుకున్న కండిషనర్ల వల్ల శిరోజాలు కళా విహీనం అయ్యే అవకాశం లేకపోలేదు. ఇలా కాకుండా ఉండాలంటే సరైన పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని బ్యూటిషియన్లు చెబుతున్నారు.

ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కురులు ఆరోగ్యంగా, నిగనిగలాడుతూ బలమైన కుదుళ్లను కలిగి ఉంటాయంటున్నారు. మనం తీసుకునే ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, పొటాషియం పాళ్లు బాగా ఉన్నట్లైతే శిరోజాలు ఆరోగ్యవంతంగా వుంటాయి.

తీసుకునే ఆహారంలో...కాల్షియం గుణాలు కలిగిన చిక్కుడు, వేరుశెనక్కాయలు, చేప వంటివాటికి చోటివ్వాలి. అలాగే మెగ్నీషియం పాళ్ళు ఎక్కువగా కలిగిన సోయా చిక్కుడు, పచ్చదనం కూరగాయలు, చపాతీ వంటివాటితోపాటు మాంగనీసు కలిగినవి అన్నిరకాల ధాన్యాలు, బఠానీ గింజలు, మాంసం, గుడ్లు తీసుకుంటుండాలి.
మరిన్ని
మీ చేతుల్లోనే మీ సౌందర్యం
ఆహార నియమాలతో అందం పదిలం
ప్రతిరోజు అందంగా..
సహజత్వమే అందం
ముఖంపై మచ్చలా..?
స్వల్ప వ్యవధిలో సౌందర్యానికి మెరుగులు..