ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అందంలో బాదాం నూనె పాత్ర
FILE
ముఖ వర్చస్సు కోసం అందరూ నానా తంటాలు పడుతుంటారు. ముఖం అందంగా ఉండాలంటే కనుబొమలు, రంగు, పెదాలు, కేశాలు తదితరాలతో పాటు చర్మ సౌందర్యం కూడా చాలా ముఖ్యం. అందుకే చర్మాన్ని తాజాగా ఉంచే సహజ సిద్ధమైన పోషకాల గురించి తెలుసుకుందాం.

బాదం పప్పులో అనేక పోషకాలు ఉన్నట్టే దాని నూనెలో కూడా చర్మానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి. చర్మంపై దురద, మంట తదితరాల నుంచి మేలైన బాదాం నూనె కాపాడుతుంది. చలికాలంలో తేమ శాతం తగ్గిపోయి చర్మం పొడిబారడాన్ని బాదాం నూనె నిరోధిస్తుంది.

ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు వంటి వాటిని రూపుమాపేందుకు బాదాం నూనె సాయపడుతుంది. చేతులు, కాళ్లు, మెడ... ఇలా శరీరానికి బాదాం నూనె రాసి మసాజ్ చేయాలి. తద్వారా బాదాం పోషకాలు చర్మంలో ఇంకుతాయి. సౌందర్య సాధనాలు కొనేటప్పుడు బాదాం గుణాలు కలిగినవి చూసి కొనటం మంచిది. ఆప్రికాట్ల తాజా రసం ముఖంపై రాసి పదినిముషాల పాటు ఉంచడం ద్వారా దురదలు, కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి.
మరిన్ని
ఆరోగ్యవంతమైన కేశాలకోసం...
మీ చేతుల్లోనే మీ సౌందర్యం
ఆహార నియమాలతో అందం పదిలం
ప్రతిరోజు అందంగా..
సహజత్వమే అందం
ముఖంపై మచ్చలా..?