ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముత్యాల్లాంటి పళ్లు కోసం...
నేటి బిజీ జీవితంలో చాలా మంది పళ్ళ సంరక్షణ కోసం తగింత సమాయాన్ని కేటాయించలేకపోతున్నారు. పళ్లే కదా అనే ఉదాసీనతను కనబరుస్తున్నారు. తద్వారా కాలక్రమంలో పలు దంత సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. పళ్లకు గారపట్టకుండా చూసుకోవాలి. పలువురి పళ్లు పసుపు రంగుతో కనిపిస్తాయి. ఇది పులురోసిస్ అనే వ్యాధికి మూలమని గ్రహించాలి.

దీనిని ప్రారంభదశలోనే గుర్తించి జాగ్రత్త పడినట్లైతే వ్యాధినుంచి బయటపడవచ్చు. అలాకాక అజాగ్రత్త కనబరచినట్లైతే ఈ పసుపురంగుతో కూడిన గార చారలు పళ్లపై శాశ్వతంగా నిలిచిపోతాయి. తద్వారా పదుగురిలో హాయిగా నవ్వలేని పరిస్థితి తలెత్తుతుంది. అదేవిధంగా తాగే మంచి నీటిలో ప్లోరైడ్ శాతం తగిన మోతాదులో ఉండే విధంగా చూసుకోవాలి.

పులురోసిస్ వ్యాధితో బాధపడేవారు అల్యూమినియం, పొటాషియం తీసుకుని అందులో కొంచెం నిమ్మ రసం కలిపి పది నిమిషాలపాటు బాగా కలపాలి. మూడు గంటల తర్వాత పలుచటి వస్త్రంలో వడబోసి, తర్వాత పుక్కిలించాలి. ఇలా చేస్తూవుంటే పళ్లు పసుపు రంగు నుంచి బయటపడి తెల్లగా మారుతాయి.
మరిన్ని
లేజర్‌ చికిత్సతో మొటిమలు మాయం
అందంలో బాదాం నూనె పాత్ర
ఆరోగ్యవంతమైన కేశాలకోసం...
మీ చేతుల్లోనే మీ సౌందర్యం
ఆహార నియమాలతో అందం పదిలం
ప్రతిరోజు అందంగా..