అతివల అందాన్ని మెరుగుపరిచే కురులను సంరక్షించుకోవడం ఎంతైనా అవసరం. కురులు తెల్లబడినట్లైతే మరీ జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా తెల్లబడిన జుట్టుకు హెన్నాను వాడితే మిగిలిన జట్టు తెల్లబడకుండా ఉంటుంది. పెరుగు, మజ్జిగను అధికంగా వాడటంతో పాటు కరివేపాకును ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. కరివేపాకు, ఉసిరికాయలను మజ్జిగలో నూరిన ప్యాక్‌ను వాడటంతో పాటు మందారం ఆకులను నూరి తలస్నానానికి వాడటం మరీ మంచిది.
జుట్టు బాగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. తలస్నానం చేసిన రోజులు తప్ప మిగిలిన రోజుల్లో గోరు వెచ్చటి నూనెతో కుదుళ్లను తాకే విధంగా రాసి మునివేళ్లతో 15 నిమిషాల పాటు మర్ధన చేస్తే జట్టు పెరుగుతుంది. జుట్టు చిక్కును కింది నుంచి పైకి తీయాలి. అనుదిన తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు అధికంగా ఇండేవిధంగా చూసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
|