ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కంటికి ఇంపుగా కనిపించడం తప్పు కాదు...
సౌందర్య పరిరక్షణ మహిళకు నేడు కొత్త కాదు. తరతరాలుగా జగదేకసుందరిల కథ మనకు తెలిసిందే కదా. అందం, అలంకారం, ఆకర్షణ, మార్దవం, సౌకుమార్యం ఇవన్నీ సౌందర్యానికి, మహిళలకు పెట్టని ఆభరణాలే. పైగా నేటి మహిళకు ఇది నిత్యావసరమై పోయింది కూడా..

ఇంటిలోనూ, పనిస్థలం లోనూ, బాడీ లాంగ్వేజ్ అంటే ఏమిటో చక్కగా అర్థం చేసుకుంటున్న ఆధునిక మహిళకు మరోవైపున తన కోసం తాను ఎంతో కొంత ఖర్చుపెట్టుకోవాలనే స్పృహ కూడా బాగా పెరిగింది. ఆరోగ్యానికి, సౌందర్య పరిరక్షణకు ఎంతో కొంత ఖర్చుపెట్టుకోవడం తమ ఆదాయ వనరులను దెబ్బతీయదని నేటి మహిళలు భావిస్తున్నారు.

గత సమాజాల్లో అందంగా అలంకరించుకునే స్త్రీలను ఏ దృష్టితో చూశారో మనకు అవసరం. కాని చిన్న చిన్న లోపాలను కన్పించకుండా అందాన్ని మరింతగా తీర్చి దిద్దుకోవడం నేటి కాలంలో యువతులకు, మహిళలకు ఒక అవసరమైపోయంది. ఆత్మసౌందర్యం, బాహ్య సౌందర్యం అంటూ తేడాలు చూపించడానికి బదులు కంటికి ఇంపుగా కనబడడం తప్పులేదు అనే సాధారణ తర్కం మహిళలను ఇప్పుడు చాలా సౌకర్యయుతంగా ఉంటోంది.

అపారమైన శక్తిసామర్థ్యతలు, ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ బాడీ లాంగ్వేజ్ లేక ఆహార్యం సరిగా లేనందున ఎన్నో అవకాశాలు వెనక్కు వెళుతున్న ప్రస్తుత కాలంలో మహిళలు తమ ఆదాయంలో కొంత సౌందర్యపోషణకు ఖర్చు పెట్టడం తప్పు కాదు. అయితే ప్రతిభాపాటవాలకు మనం కనిపించే తీరు తోడవాలంటే మన సౌందర్య పోషణ, మనం పెట్టే ఖర్చు మన వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చేలాగే ఉండాలనేది ప్రాధమిక సత్యం.

అందుకే బాహ్య సౌందర్యం, ఆహార్యం, మాటతీరు, దేహభాష, కనిపించే తీరు ఇవన్నీ నేటి స్త్రీ వ్యక్తిత్వానికి సొబగులద్దుతున్నాయి. కంటికి ఇంపుగా లేని ఏ వస్తువునూ మనం సాధారణంగా దగ్గరకు తీసుకోలేం కదా.. మహిళ నేడు తన సౌందర్య పరిరక్షణకు పడుతున్న తపనను కూడా ఇలాగే అర్థం చేసుకోవాలి.
మరిన్ని
బరువు తగ్గించుకోవడంలో కొత్తమార్గం...
నిద్రలేమికి పరిష్కారమార్గాలు
మిలమిల మెరిసే ముఖారవిందానికి చక్కని చిట్కాలు
వేసవిలో చర్మ సంరక్షణకు చిట్కాలు...
తేనెలొలికే పెదవుల కోసం
నిగనిగలాడే శిరోజాల సౌందర్యానికి వెనిగర్ సాయం