|
దేవుని పూజకు ఉపయోగించిన పూలను ఎండిపోయాక పారేయకండి. వాటిని ఎండలో పెట్టి ఫేస్ పౌడర్‌గా ఉపయోగించకోవచ్చు. వీటితో పాటు కాస్త పసుపును కలిపి పొడి చేసుకుని పెట్టుకోండి. ఈ పొడిని రెండు స్పూన్లు తీసుకుని ఇందులో కాస్త రోజ్‌వాటర్ లేదా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాయండి. ఆరాక చల్లని నీటితో కడిగేయండి. ముఖం కాంతివంతమవడమే కాకుండా, చర్మం మృదువుగా తయారవుతుంది.
|