ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పది కాలాల పాటు పదిలమైన అందం కోసం
Beauty
FileFILE
మీ అందాన్ని పదికాలాల పాటు అలానే పదిలం చేసుకోవాలనుకుంటున్నారా ? నలభైల్లో పడినా ఇరవైలలాగానే ఉండాలనుకుంటున్నారా ? ఎక్కువగా ఖర్చు చేసి హైరానా పడనవసరం లేదు. మీ ఇంట్లోనే అందుబాటులో ఉన్న సామాగ్రితోనే మీ కోరికను నెరవేర్చుకోవచ్చు. దీనికై మీ కోసం కొన్ని అమూల్యమైన చిట్కాలు...

మీరు ప్రొద్దున్నే నిద్ర లేవగానే మీ ముఖంపై పేరుకున్న నూనెను కడిగేయొద్దు. ఎందుకంటే అది సహజసిద్ధమైనది. ఆ నూనెను అలానే పైకి, కిందకి చేత్తో రాసి బుగ్గలపైకి వరకు మసాజ్ చేయండి. ఆ తర్వాత మీ ముఖాన్ని కడుక్కోవచ్చు. అయితే సబ్బు లేకుండానే కడుక్కోవాలి మరి. నిద్ర తర్వాత ముఖం కడగడమనేది నీటితో మాత్రమే అయి ఉండాలి.

మీ నోటి నిండా నీరు నింపి పుక్కిలించి ఉమ్మేయండి. అలాగే చల్లని నీటితో ముఖాన్ని, కళ్లను శుభ్రం చేయండి. అంటే నీళ్లను కళ్లపై కొట్టండి. ఇదో రకమైన వ్యాయామం. అలాగే చెంచా నిండా తేనె, నిమ్మరసాలను గ్లాసు నీళ్లలో కలిపి రోజూ ప్రొద్దునే పరగడుపునే త్రాగండి. ఇలా చేయడం ద్వారా కడుపులో రసాయనాలు శుభ్రం అవుతాయి. ఈ విధంగా చేయడం ప్రారంభించినప్పట్నుంచీ మీ చర్మం ఓ నెలలోనే మెరవడాన్ని గమనిస్తారు.

కెఫైన్‌లు కలిగిన శ్యాచురేటెడ్ పానీయాలను త్రాగడం తగ్గించండి. అలాగే ఎక్కువగా వేయించిన పదార్థాలను కూడా తగ్గించండి. వీలైనప్పుడల్లా నడవండి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చాలా అవసరం. ఒకవేళ నడిచేందుకు అవకాశం లేనంతగా మీరు బిజీ అయితే ఇలా చేయండి. లిఫ్ట్ ఎక్కడం కన్నా మెట్లు ఎక్కడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే మీ వాహానాలను కాస్త దూరంగా పార్క్ చేయండి. ఇలా చేస్తేనైనా నడిచే అవకాశం మీకు దక్కుతుంది. సరైన సమయంలో వ్యాయామాలు చేస్తూ సమతులాహారం తీసుకుంటూ ఆనందంగా, అందంగా ఉండండి.
మరిన్ని
వేసవిలో చర్మానికి చిట్కాలు
నల్ల మచ్చలు పోవడానికి
పువ్వులతో ఫేస్ పౌడర్
కంటి చుట్టూ నల్లని వలయాలకు
నయనాల అందం కోసం
ముఖానికి వెలుగు కోసం