చూయింగ్‌గమ్ అతిగా తింటే ఆరోగ్యం పాడవడం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ దాన్ని పూర్తిగా మానవద్దని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. కోలముఖం కలిగిన వారు బుగ్గలు లావవుతాయని భావిస్తూ అదేపనిగా చూయింగ్‌గమ్ నములుతూంటారు. ఈ బుగ్గల లావు సమస్యను అలా పక్కన బెడితే, మరొవైపు ఇది ముఖానికి మంచి వ్యాయామాన్నిస్తుంది. దాని ఆకృతిని అందంగా తీర్చిదిద్దుతుంది.
చూయింగ్‌గమ్‌ని గంటసేపు అదేపనిగా నమిలితే 11 కాలరీలు ఖర్చవుతాయని వ్యాయామ నిపుణులు పేర్కొంటున్నారు. అదెలాగంటే.. చూయింగ్‌గమ్ నోట్లో ఉండడం వల్ల, రుచి చూసే నెపంతో మహిళలు వంటింట్లో పదార్థాలను ఆరగించే తిళ్లకు ఇది అడ్డుకట్టు వేస్తుందని వీరు పేర్కొంటున్నారు. అలాగే స్నాక్స్ తినడానికి ముందు కూడా చూయింగ్ గమ్ మిగిలితే మీ ఆకలి బాగా తగ్గుతుందట.
ఈ విధంగా చిరుతిళ్ల పిచ్చిని కూడా నియంత్రించే చూయింగ్ గమ్ వల్ల శరీరంలో పేరుకుని ఉన్న అదనపు కాలరీలు కరిగిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగని మితిమీరి చూయింగ్‌గమ్ నమిలితే అసలే ఒంటికి మంచిది కాదని వీరు హెచ్చరిస్తున్నారు. అందుకే ముఖానికి వ్యాయామం కోసం చూయింగ్‌గమ్ నమలండి. అదీ కొన్నిసార్లే మరి.
|