వేసవి కాలంలో చర్మానికి జాగ్రత్తలు తీసుకోవాలని... ఆ క్రీములు వాడాలని... ఇవి వాడాలని... అవి వాడకూడదని... ఇలా పలు రకాల సలహాలు వింటుంటాం కదా అయితే వీటిలో ఏ నియమాలు పాటించాలో తెలియక కంగారు పడిపోతున్నారా ? ఏవి వాడాలో వాడకూడదో అర్థం కావట్లేదా ? అయితే మీకోసం సింపుల్‌గా ఐదు సూత్రాలు...
మిగతా కాలాలలో మీ చర్మం పట్ల చూపించిన శ్రద్దే ఎండాకాలంలో కూడా చూపించాలి. అయితే ఇందులో కాస్త మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా మీరు తీసుకునే ఆహారంతో పాటు అధికంగా నీరు ఉండే పళ్లు, రసాలు తీసుకోండి.
చర్మాన్ని ఎల్లవేళలా రక్షించుకునేందుకు తగిన క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం వంటివి చేయాలి. తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. అలాగే ముఖంపై ఉండే మృతకణాలను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి.
మీ కేశాలు, చేతులు, కాళ్లు, మిగతా శరీర భాగాలను ఎండ నుంచి కాపాడుకోవాలి. ఇందుకోసం విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోండి. అలాగే ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
శరీరాన్ని పటిష్టంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ బ్యాలెన్స్‌డ్ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. మనసును అదుపులో ఉంచుకునేందుకు యోగా, ధ్యానం చేయండి. ఇది చేయడం ద్వారా ప్రశాంతత మాత్రమే కాదు చర్మానికి కొత్త కాంతి కూడా వస్తుంది.
అన్నిటికంటే ముఖ్యమైనది సంతోషం మీ మనసులో సంతోషం పొంగి పొరలుతుంటే మిమ్మల్ని ఏ నిరుత్సాహం దరిచేరదు. అలాగే ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించండి. బాధలు ఉన్నప్పటికీ, ముఖంపై చిరునవ్వును చెరగనివ్వద్దు. పై వాటిని క్రమం తప్పకుండా పాటిస్తుంటే ఏ కాలమైనా సరే మీరు నవ యవ్వనంగా, సంతోషంగా ఉంటారు.
|