ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వేసవిలో ముఖ సౌందర్యం: కొన్ని చిట్కాలు
ఆపిల్+తేనె: ఆపిల్‌ను తొక్కుగా చేసుకుని దానిలో కొంచెం తేనె కలిపి ముఖం, మెడ భాగాల్లో పట్టించి కొంతసేపు ఉంచి కడిగేస్తే ముఖం ఫ్రెష్‌గా మారడంతో పాటు కాంతివంతంగాను ఉంటుంది.

టమోటా: బాగా పండిన నాలుగు టమోటాలను గుజ్జుగా చేసి దాన్ని ముఖం, మెడ భాగాల్లో పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.

ఇవికాక వేసవికాలంలో రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముఖం మరింత తాజాగా, కాంతివంతంగా ఉండే అవకాశముంది. పన్నీరు, నిమ్మరసం, బాదం నూనెలను సమపాళ్లలో తీసుకుని దాన్ని ముఖం, మెడ భాగాల్లో పట్టించాలి.

ఉదయం లేచాక తొలుత వేడినీటితోను, అటుపై చల్లని నీటితోను ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తే ఎండవల్ల కందిపోయిన చర్మం చక్కగా తయారవుతుంది. అంతేకాక వారంలో రెండుసార్లు ముఖానికి ఏదైనా హెర్బల్ ప్యాక్ వేసుకోవాలి. అలాగే ఎండలో వెళ్లేటప్పుడు చర్మానికి మంచి సన్‌స్క్రీన్‌లోషన్ పూసుకోవాలి. ఎండ నేరుగా ముఖంపై పడకుండా గొడుగులాంటివి వాడాలి.

అంతేకాక ఎండ అధికంగా ఉండే సమయంలో బయటకు వెళ్లడాన్ని నివారించాలి. ఇలా పైన చెప్పిన చిట్కాలు పాటించగలిగితే మండే వేసవిలోనూ అందమైన ముఖం మీ సొంతం.
<< 1 | 2 
మరిన్ని
అందం కోసం ఐదు సూత్రాలు
చూయింగ్‌గమ్‌తో ముఖానికి వ్యాయామం
పది కాలాల పాటు పదిలమైన అందం కోసం
వేసవిలో చర్మానికి చిట్కాలు
నల్ల మచ్చలు పోవడానికి
పువ్వులతో ఫేస్ పౌడర్