ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మైమరిపించే పెదవులకు నిగారింపు...  Search similar articles
Raju
పెదవులపైన సింగారం.. మధువొలికించే మందారం.. అంటూ పాత సినిమా పాటలో కవి ముక్తాయింపును బట్టి యువతి పెదవుల సింగారపు శక్తి ఏమిటో అర్థమవుతుంది. సింగారానికే కాదు.. పెదవి చేయగలిగిన మరొక మహత్తరమైన పని ఉంది. అది మానవులకే సొంతం కూడా.. అదే.. నవ్వడం..

పెదవులు చేయగలిగే మొదటి మంచిపని ఏది అంటే 'నవ్వడం' అని సమాధానమిచ్చాడు ఓ కొంటె కోణంగి. వీడితో పని కాదని కాస్త పక్కకు పోయి పెదవులు చేయగలిగే మొదటి మంచిపని ఏదని అడిగితే వాడూ 'నవ్వడమే' అని సమాధానం ఇచ్చాడట..

నవ్వులే మర్చిపోతున్న పాడుకాలంలో నవ్వని పెదవుల సంఖ్యే ప్రస్తుతం ఎక్కువగా ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు కానీ.. మత్తెక్కించే, మరులు గొలిపించే, మైమరిపించే, ఆ పెదవులు మహిళవైతే... హరివిల్లువంటి పెదవి వంపులోంచి చిరుమందహాసాన్ని ఓరగా అలా ఒలికిస్తే...

పాదాక్రాంతులు కాని పురుషపుంగవులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా... చిరునవ్వు అనే ఆ మహిమాన్విత మహత్తర సంపదను తమ పెదవి వంపులో పెట్టుకుని పరలింగాన్ని -అపోజిట్ సెక్స్- అమాంతంగా బోల్తా కొట్టించే యువతీ లలామ పెదవులకు నిగారింపు లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవలసిందే..

ఇంతకూ చెప్పొచ్చిందేమిటంటే.. పెదవుల పైన సింగారం ఓలలాడాలంటే వాటికి నిగారింపు అవసరం. ఆ నిగారింపుకు కొన్ని చిట్కాలు చూద్దామా...
1 | 2  >>  
మరిన్ని
లావు తగ్గాలనుందా... నిదానంగా తింటే సరి...
డబ్బుతో మాత్రమే సౌందర్యాన్ని కొనలేరు...
చర్మ సమస్యా...? ఐతే ఇలా చేయండి...
చూడచక్కటి దంతసిరి కావాలనుకుంటే..
పెదాలకు కాంతినిచ్చే లిప్ గ్లాస్
అందమైన నల్లని కురుల కోసం... చిట్కాలు