ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > సౌందర్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రెండింటికీ ఉపశమన మార్గం స్పాస్  Search similar articles
FILE
క్షణం విరామం లేకుండా పని ఒత్తిడిలో గడిపేసే వేగవంతమైన నగర జీవితంలో వారాంతపు మానసిక ఉపశమనం కోసం కొత్త కొత్త మార్గాలు పుట్టుకొస్తున్నాయి మరి. శరీరంలోని ఒక్కో అవయవానికి ఒక్కో చోట ట్రీట్‌మెంట్ తీసుకోవడం అంటే ఖర్చుతో కూడుకున్న పని.

అందుకే బ్యూటీ పార్లల్‌కి వెళ్లాలంటే చాలా మంది ఖర్చుకు భయపడి జడుసుకుంటారు. పైగా ఒక్కో చోటికి ఒక్కోసారి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకోవడం అంటే ఉన్న ఆ వారాంతపు సెలవు పూర్తిగా దానికే సరిపోతుంది. మరి ఎలా?

మన శరీరాన్ని, మనస్సును ఒకే చోట రిలాక్స్ చేసే చోటు గనుక ఉంటే అందరమూ అక్కడికే దూకెయ్యమూ.. ఇలాంటి అవసరం కోసమే ఇదిగో నేనున్నానంటూ వచ్చేసింది స్పాస్. స్పాస్ అంటే మనకు కొత్త కావచ్చు కాని పాశ్చాత్య ప్రపంచంలో ఎప్పటినుంచో ఉన్నాయి.

పని ఒత్తిడిని ప్రపంచమంతా సమానంగా పంచుకునే కాలం కాబట్టి మనం విదేశాల్లోకి పోయి స్పాస్‌ని దర్శించటం కాక మన ఇంటి ముందుకే అది వచ్చేసింది. కొండ మన దగ్గరకు రాకపోతే మనమే కొండ దగ్గరకు పోవాలి అనే సామెతను కొంచె రివర్స్ చేసి చదువుకుంటే అదే స్పాస్.

బాడీని, సోల్‌ని ఒకే చోట రిలాక్స్ చేసే కాన్సెప్ట్‌తో తయారయ్యిందే స్పాస్. ఇది మన హైదరాబాద్‌కు కూడా వచ్చేసింది. ఉన్నవి తక్కువే అయినా వీటికి రాష్ట్ర రాజధానిలో ఉండే ఆదరణ మాత్రం తక్కువ కాదు. బ్యూటీ పార్లల్‌కి, స్పాస్‌కి తేడా పెద్దగా ఉండదు.

బ్యూటీ పార్లల్‌లో మనకు అవసరమైన శరీరభాగానికి మాత్రమే ఫేషియల్ చేసుకుంటాం. కాళ్లు, చేతులు, ముఖం ఇలా ఏది అవసరమైతే దానికి మాత్రమే పార్లల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటా. కాని శరీరం మొత్తానికి ఫేషియల్ చేసేదే స్పాస్.

ఫేషియల్ ఫర్ ది ఎంటైర్ బాడీ.. ఇదీ ఈ కాలపు స్పాస్ మంత్రం. అదేమిటో చూడాలంటే కింది వీడియో చూడండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
మైమరిపించే పెదవులకు నిగారింపు...
లావు తగ్గాలనుందా... నిదానంగా తింటే సరి...
డబ్బుతో మాత్రమే సౌందర్యాన్ని కొనలేరు...
చర్మ సమస్యా...? ఐతే ఇలా చేయండి...
చూడచక్కటి దంతసిరి కావాలనుకుంటే..
పెదాలకు కాంతినిచ్చే లిప్ గ్లాస్